Prashanth Neel : కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఈయన తీసిన సినిమాలన్నీ కూడా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలే కావడం విశేషం…ఇక డార్క్ మోడ్ లో ఉంటూ భారీ హీరోయిజాన్ని చూపిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడంలో ఆయనకు సపరేట్ స్టైల్ అయితే ఉంది. మరి అతని సినిమాలు చూసిన ప్రతి ఒక్కరు ఆయన సినిమాల్లో యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ప్రశాంత్ నీల్ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలనే చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆయన కెరియర్ స్టార్టింగ్ లో చేసిన ఉగ్రం సినిమా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చింది. అయితే ఈ సినిమాకి అనుకున్న రేంజ్ లో ఆదరణ అయితే దక్కలేదు. దాంతో యాక్షన్ సినిమాల్ని మనం సరిగ్గా చేయలేమా అని ఆయన కొంతవరకు దిగులు చెందట. ఇక అంతలోనే ఎలాగైనా సరే మనం ఒక భారీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాను చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాలి అనే ఉద్దేశ్యంతో కే జి ఎఫ్ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు.
Also Raed : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..?
ఇక అప్పటి నుంచి యాక్షన్ సినిమాలను మనం చేసినట్టుగా మరెవరు చేయకూడదని టార్గెట్ పెట్టుకొని మరి సూపర్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న డ్రాగన్ సినిమాలో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది…
ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ ని భారీ లెవెల్లో చూపించడమే కాకుండా సినిమాలో కాటేరమ్మ ఫైట్ ఎలాగైతే ఉంటుందో అంతకుమించిన ఫైట్లు ఈ సినిమాలో ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. ఒకప్పుడు మంచి గుర్తింపును సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత కాలంలో అలాంటి మాస్ ఎలిమెంట్స్ తో ఉన్న సినిమాలనైతే చేయలేకపోయాడు.
Also Read : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసింది!
కానీ ఇప్పుడు ఈ సినిమాతో ఆయన అనుకున్న కోరిక నెరవేరబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో చాలా మంచి స్టాండర్డ్ ఉన్న నటుడు దొరికితే హిట్ సినిమా చేయొచ్చు అని అభిప్రాయపడే దర్శకులు సైతం ఉన్నారు… ఇక అలాంటి హీరో ను పెట్టుకొని ప్రశాంత్ నీల్ ఎలాంటి సినిమాలు చేస్తాడు ఆయన కంటు ఒక భారీ ఐడెంటిటిని సంపాదించుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…