https://oktelugu.com/

Pushpa 2 Reloaded Version : పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్’ ను పోస్ట్ పోన్ చేయడానికి అసలు కారణం ఏంటో తెలిసిపోయింది…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన ఈ స్టార్ హీరోలు అందరూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : January 8, 2025 / 10:31 PM IST

    Pushpa 2 Reloaded Version

    Follow us on

    Pushpa 2 Reloaded Version : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ‘పుష్ప 2’ సినిమాతో పాన్ ఇండియా లో 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టారు. ఇక ఇప్పుడు మరోసారి ‘పుష్ప 2’ సినిమా ఇమేజ్ ను వాడుకొని మరిన్ని కలెక్షన్లు రాబట్టే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లను ఎడిటింగ్ రూమ్ లో కట్ చేసిన విషయం మనకు తెలిసిందే…ఇక ఆ సీన్స్ అన్నింటిని యాడ్ చేస్తూ పుష్ప 2 రీ లోడెడ్ వెర్షన్ అంటూ సినిమాలో కొన్ని సీన్స్ ని యాడ్ చేసి సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక దాదాపు 20 నిమిషాల పాటు పుటేజ్ ను యాడ్ చేయాలనే ఉద్దేశ్యం తో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే ఇప్పటికే 3 గంటల 20 నిమిషాల నిడివితో ఉన్న ‘పుష్ప 2’ సినిమాకి అదనంగా 20 నిమిషాలు అంటే 3 గంటల 40 నిమిషాల పాటు ఈ సినిమాని వీక్షించాల్సిన అవసరమైతే ఉంది.

    ఇక బ్రేక్ టైమ్ తో కలుపుకొని నాలుగు గంటల పాటు ఈ సినిమాను చూడాలి అంటే ప్రేక్షకులు ఒక రోజులో హాఫ్ డే దీనికోసమే కేటాయించాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇదిలా ఉంటే ఈ రీలోడేడ్ వెర్షన్ ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే సన్నాహాలు చేస్తున్నారు.

    ఇక ఈరోజు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రీలోడెడ్ వెర్షన్ ని పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తోంది. దాంతో జనవరి 17వ తేదీన ‘పుష్ప 2’ న్యూ వెర్షన్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే మొన్నటిదాకా గేమ్ చేంజర్ సినిమాకి పోటీగా ఈ మూవీని దింపబోతున్నారంటూ కొన్ని కామెంట్లు వచ్చినప్పటికి ఇప్పుడు అల్లు అరవింద్ ఎంటరై ఈ సినిమా రీలోడెడ్ వెర్షన్ ని రిలీజ్ చేయడానికి సంక్రాంతి తర్వాత ముహూర్తం పెట్టినట్టుగా తెలుస్తోంది.

    ఇక అందులో భాగంగానే జనవరి 17 వ తేదీన ఈ సినిమాకి సీన్లు ఆడ్ చేసి రిలీజ్ చేస్తే మంచి ఆదరణ దక్కుతుందని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పటికే కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ సినిమాను ఎవరు పట్టించుకోరు అనే ఉద్దేశ్యం తో కూడా వాళ్ళు దీనిని వాయిదా వేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ ను భారీగానే వాడుకుంటున్నాడు. ఇక ఈ సినిమా దాదాపు 20 కోట్ల కలెక్షన్స్ ను ఈజీగా వసూలు చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…