https://oktelugu.com/

Pushpa 2 Movie Collections : పుష్ప 2 ‘ రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ‘కల్కి’ మొదటి రోజు కంటే ఎక్కువ ఉందా..? ఇదేమి అరాచకం సామీ!

హిందీ లో ఈ సినిమా షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' మొదటి రోజు రికార్డుని కూడా బద్దలు కొట్టింది. కేవలం మొదటి రోజు మాత్రమే కాదు, రెండవ రోజు కూడా ఈ సినిమాకి భారీ వసూళ్లు వచ్చేలా అనిపిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంది. కల్కి మొదటి రోజుకి కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Written By:
  • Vicky
  • , Updated On : December 6, 2024 / 12:01 PM IST

    Pushpa 2 Movie Collections

    Follow us on

    Pushpa 2 Movie Collections :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై, బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకొని, ఆల్ టైం ఓపెనింగ్ రికార్డుని సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. #RRR చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, పుష్ప చిత్రానికి 280 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా హిందీ లో ఈ సినిమా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ మొదటి రోజు రికార్డుని కూడా బద్దలు కొట్టింది. కేవలం మొదటి రోజు మాత్రమే కాదు, రెండవ రోజు కూడా ఈ సినిమాకి భారీ వసూళ్లు వచ్చేలా అనిపిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంది. కల్కి మొదటి రోజుకి కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    బుక్ మై షో లో ఈ చిత్రానికి రెండవ రోజు మార్నింగ్ షోస్ నుండే భారీ స్థాయిలో టికెట్స్ సేల్స్ అవుతున్నాయి. గంటకి 90 వేలకు పైగా టికెట్స్ రెండవ రోజు అమ్ముడుపోవడం ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా జరగలేదు. ప్రభాస్ కల్కి చిత్రానికి మొదటి రోజు గంటకి 90 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతే, వేరే లెవెల్ అని అనుకున్నారు. కానీ పుష్ప చిత్రానికి రెండవ రోజు ఆ స్థాయి ట్రెండ్ ఉండడం మామూలు అరాచకం కాదనే చెప్పాలి. తెలుగు తో పాటు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా సాలిడ్ గా ఉన్నాయి. ఈ రేంజ్ బుకింగ్స్ చూస్తుంటే రెండవ రోజు ముగిసే సమయానికి ఈ చిత్రం కచ్చితంగా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    మన స్టార్ హీరోల సినిమాలకు మొదటి రోజు 150 కోట్ల రూపాయిలు వస్తేనే పెద్ద అఛీవ్మెంట్ గా భావిస్తుంటారు ప్రేక్షకులు, అభిమానులు. అలాంటిది ‘పుష్ప 2’ చిత్రానికి రెండవ రోజు ఆ స్థాయి వసూళ్లు వచ్చాయంటే జనాల్లో ఈ సినిమాకి ఏ రేంజ్ పాజిటివ్ టాక్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఒక్క హిందీ వెర్షన్ నుండే ఈ చిత్రానికి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోమవారం నుండి స్టడీ కలెక్షన్స్ ని ఈ చిత్రం నమోదు చేసుకుంటే మాత్రం కచ్చితంగా ఫుల్ రన్ లో రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఊపు చూస్తూ ఉంటే మొదటి వీకెండ్ లోనే 700 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబడుతుందని అంటున్నారు. చూడాలి మరి ఈ చిత్రం వర్కింగ్ డేస్ లో డీసెంట్ స్థాయిలో హోల్డ్ చేస్తుందా లేదా అనేది.