Odi World Cup 2023 Song: ఇంకో పది రోజుల్లో వరల్డ్ కప్ స్టార్ట్ అవుతున్న నేపధ్యం లో అన్ని జట్లు కూడా వరల్డ్ కప్ సమరానికి సిద్ధం అవుతున్నారు.అయితే అన్ని జట్లని ఎంకరేజ్ చేయడానికి ఐసీసీ ప్రత్యేకం గా ప్రపంచ కప్ కోసం ఒక సాంగ్ ని రూపొందించింది.దిల్ జోషన్ బోలె అంటూ సాగె ఈ సాంగ్ లో బాలీవుడ్ హీరో అయిన రణ్ వీర్ సింగ్ తో పాటు ఈ సాంగ్ లో చాహల్ భార్య అయిన ధన శ్రీ కూడా పాల్గొని అభిమానులను ఉత్సాహ పరచడానికి ఆడి పాడారు…
ఇక చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నా ఈ వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ లాస్ట్ వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన ఇంగ్లాండ్ టీం కి, న్యూజిలాండ్ టీం కి మధ్య జరుగుతుండడం నిజంగా విశేషం అనే చెప్పాలి.ఇక ఈ వరల్డ్ కప్ లో ఇండియా మొదటి మ్యాచ్ ని ఆస్ట్రేలియా తో ఆడబోతుంది.ఇక ఈ మ్యాచ్ లో కనక ఇండియా గెలిస్తే మొదటి మ్యాచ్ లోనే ఆస్ట్రేలియా ని చిత్తూ చేసిన టీం గా ఈ వరల్డ్ కప్ మొత్తానికి ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఇండియా టీం నిలుస్తుంది…ఇక దీనికోసం ఇప్పటికే ఇండియా చాలా కసరత్తులు చేస్తుంది.ఇక ఇది ఇలా ఉంటె వరల్డ్ కప్ లో ఏ టీం మీద ఏ టీం పై చేయి సాధిస్తుంది అనేది తెలుసుకోవడానికి ప్రపంచం మొత్తం ఉత్కంఠ గా ఎదురు చూస్తుంది.ఇక ప్రపంచ కప్ గెలుచుకోవడానికి అన్ని టీం లు చాలా కసి తో ఎదురు చూస్తున్నాయి…
ఇక మన టీం మాత్రం మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా తో ఆడిన తరువాత సెకండ్ మ్యాచ్ ఆఫ్గానిస్తాన్ మీద ఆడుతుంది. ఇక అక్టోబర్ 14 తేదీన మాత్రం పాకిస్థాన్ మీద తలపడుతుంది.ఈ మ్యాచ్ వరల్డ్ కప్ అంతటికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనుంది అనే విషయం అయితే స్పష్టం గా తెలుస్తుంది…ఇండియన్ టీం అభిమానులు మళ్లీ పాకిస్థాన్ ని చిత్తు గా ఓడించాలి అంటూ ఈ మ్యాచ్ మీద ఇప్పటికే సోషల్ మీడియా లో చాలా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ తరువాత బాంగ్లాదేశ్ మీద మ్యాచ్ ఆడనున్నట్టుగా తెలుస్తుంది.