Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటికే ప్రతి టీం ఆడుతున్న ప్రతి మ్యాచ్ లో మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. చిన్న టీములుగా చెప్పుకునే ఆఫ్గనిస్తాన్ ,నెదర్లాండ్ లాంటి టీములు కూడా సూపర్ మ్యాచ్ లు ఆడుతూ పెద్ద టీంలను సైతం మట్టి కరిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు వరల్డ్ కప్ లో సగం మ్యాచులు ముగిశాయి దాంతో ఏ జట్టు సెమిస్ కి చేరుకోబోతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది…ఈ క్రమంలో ఎప్పుడు లేని విధంగా ఈ వరల్డ్ కప్ లో ఉన్న అన్ని టీమ్ లు కూడా చాలా మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి.ఇక రీసెంట్ గా ఆఫ్గనిస్తాన్ టీమ్ వరుసగా ఇంగ్లాండ్, పాకిస్తాన్ లాంటి జట్లను ఓడించి తను కూడా సెమిస్ లో ఉన్నానని ఒక సంకేతం అయితే మిగిలిన జట్ల కి పంపిచింది.ఇక ఇలాంటి క్రమంలోనెదర్లాండ్ టీమ్ కూడా సౌతాఫ్రికా టీమ్ ని ఓడించి వాళ్లు కూడా వీలైతే ఏజట్టునైనా సరే ఓడించడానికి మేము రెడీగా ఉన్నామంటూ మిగితా జట్లకి సైతం వాళ్లు సవాళ్లను విసురుతున్నారు. ఇక ఏ టీం పరిస్థితి ఎలా ఉంది. ఏ టీమ్ కి సెమిస్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
ఇండియా
ముందుగా ఇండియా టీం గురించి కనుక చూసుకున్నట్లయితే ఇండియా ఆడిన ఐదు మ్యాచ్ లో వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచి ఇండియన్ టీం స్టామినా ఏంటో ప్రపంచ దేశాలకు సైతం తెలియజేసింది.అలాగే పది పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది.ఇక ఈ క్రమంలో ఇండియా ఇంకా నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అందులో భాగంగానే శ్రీలంక, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, నెదర్లాండ్ లాంటి టీం లతో మ్యాచు లు ఆడాల్సి ఉన్నాయి. ఇక ఈ నాలుగు మ్యాచ్ ల్లో గెలిచిన ఇండియా నెంబర్ వన్ స్థానంలో సెమీస్ కి చేరుకుంటుంది. ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్న రోహిత్ సేన ఈ నాలుగు కి నాలుగు మ్యాచ్ లు గెలిచిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఓటమి లేని ఇండియా ఆడే 4 మ్యాచ్ లను కూడా గెలిచి లీగ్ దశ ని సక్సెస్ ఫుల్ గా ముగించాలని చూస్తుంది.
సౌతాఫ్రికా
ప్రస్తుతం సౌతాఫ్రికా టీమ్ ఐదు మ్యాచ్ లు ఆడితే అందులో నాలుగు మ్యాచ్ ల్లో గెలిచి నెంబర్ టు పోజిషన్ లో కొనసాగుతుంది ఇక ఇప్పటికే సౌతాఫ్రికా టీం సెమీస్ కి దూసుకెళ్లే రేసులో మిగతా జట్ల కంటే ఒక అడుగు ముందంజలో ఉందనే చెప్పాలి. ఎందుకంటే సౌతాఫ్రికా టీమ్ ఒక నెదర్లాండ్ టీమ్ ని మినహాయిస్తే మిగిలిన అన్ని మ్యాచ్ ల్లో కూడా వాళ్ల సత్తా చాటుతూ వరుస విజయాలను అందుకుంటుంది.ఇక ఈ టీంలో డికాక్ అయితే వరుస సెంచరీలు చేస్తూ సౌత్ ఆఫ్రికా విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు.ఇక సౌతాఫ్రికా తన తదుపరి మ్యాచ్ లు
పాకిస్థాన్, న్యూజిలాండ్,ఇండియా, అప్ఘానిస్థాన్ జట్లతో తలపడనుంది.
తదుపరి జట్లపై ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే సౌతాఫ్రికా సెమీస్ కి చేరుకుంటుంది. ఇక అందులో భాగంగానే పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇండియా లాంటి టీమ్ లను ఓడిస్తుందా లేదా అనేది చూడాలి…
న్యూజిలాండ్
న్యూజిలాండ్ టీం కూడా మొదటగా ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో వరుస విజయాలను అందుకుంటూ ఈ టోర్నీ లో చాలా వేగంగా ముందుకు దూసుకువచ్చింది.ఇక ఇండియా తో ఆడిన మ్యాచ్ లో మాత్రం ఓడిపోయి మొదటి ఓటమిని చవిచూసింది ఇక ఇప్పటికే నాలుగు మ్యాచ్ ల్లో గెలిచి పాయింట్స్ టేబుల్ లో నెంబర్ త్రి పొజిషన్ లో ఉంది అయితే ఇంతకు ముందు నెంబర్ 2 పొజిషన్ లో ఉండేది, కానీ సౌతాఫ్రికా టీమ్ బంగ్లాదేశ్ మీద భారీ విజయాన్ని అందుకోవడం తో న్యూజిలాండ్ సెకండ్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్ కి వెళ్ళిపోయింది. ఇక న్యూజిలాండ్ టీమ్ తన తదుపరి మ్యాచ్‌లుగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక జట్ల తో తలపడనుంది. అయితే ఈ క్రమం లో ఈ నాలుగు మ్యాచ్ ల్లో రెండు మ్యాచ్ లలో గెలిచిన న్యూజిలాండ్ టీమ్ సెమిస్ కి చేరుకుంటుంది. అయితే న్యూజిలాండ్ టీం కున్న ప్రధానమైన బలం ఏంటంటే బ్యాటింగ్ కాబట్టి వీళ్ళు ఎంత స్కోర్ అయినా సరే సునాయాసంగా చేదించగలరు. అలాగే మొదటి బ్యాటింగ్ తీసుకున్నట్లయితే భారీ స్కోరు చేయడంలో వాళ్ళ బ్యాట్స్ మెన్స్ అందరూ కూడా తమ వంతు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు…
ఆస్ట్రేలియా
వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా టీం మొదటి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి పేలవమైన పర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత మ్యాచ్ ల్లో విజయాలను సాధించి మళ్లీ సెమిస్ రేసులో దూసుకుపోతుంది. ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్ లు ఆడితే అందులో రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి మిగిలిన రెండు మ్యాచ్ ల్లో మాత్రం ఓడిపోయింది. ఇక పాయింట్స్ టేబుల్ లో 4 పాయింట్స్ తో నాలుగోవ పొజిషన్ లో కొనసాగుతుంది.ఇక ఆస్ట్రేలియా తన తదుపరి మ్యాచ్ లు నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో తలపడనుంది. ఇక ఈ టీమ్ సెమిస్ కి వెళ్లాలంటే దాదాపు నాలుగు నుంచి ఐదు మ్యాచ్ ల్లో గెలవాలి. ఇందులో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్లు కూడా ఉన్నాయి వీటిని కూడా ఓడిస్తేనే ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరుకుంటుంది. కానీ న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లను ఎలా ఎదుర్కొంటుంది అనేదానిపైనే ఆసీస్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి…
పాకిస్థాన్
పాకిస్థాన్ మొదటి రెండు మ్యాచ్ ల్లో గెలిచి మంచి విజయాలను సంపాదించినప్పటికీ ఆ తర్వాత ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్ టీమ్ ల మీద వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయి సెమీస్ ఆశలను కష్టతరం చేసుకుంది. ఇక ఇలాంటి సమయంలో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లతో తలపడనున్న పాకిస్థాన్ తను ఆడే అన్ని మ్యాచ్ ల్లో కూడా విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది.ఇక ఈ క్రమం లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లను ఓడించడం పాకిస్థాన్‌కు కష్టంతో కూడుకున్న పనే ఇక ఈ సమయం లో పాకిస్థాన్ ఒక్క మ్యాచ్ లో ఓడిపోయిన సరే సెమీస్ కి వెళ్లకుండా ఇంటికి వెళ్లాల్సి వస్తుంది…
ఆఫ్గనిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్ టీం టోర్నీలో అద్భుతాలు చేస్తుందనే చెప్పాలి.ఎందుకంటే తనదైన రీతిలో మంచి విజయాలను అందుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ తన తదుపరి మ్యాచ్ లుగా శ్రీలంక, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో తలపడనుంది. నిజానికి ఆఫ్గనిస్తాన్ టీమ్ ఒక చిన్న టీం గా వచ్చి సెమీస్ బరిలో నిలిచింది అంటే ఆఫ్గనిస్తాన్ రోజు రోజుకీ ఎంత స్ట్రాంగ్ టీమ్ గా తయారవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు…
ఇక ఆ తర్వాత శ్రీలంక ,బంగ్లాదేశ్ ,నెదర్లాండ్ ఇంగ్లాండ్ లాంటి టీమ్ లు ఉన్నాయి ఈ టీములు అన్ని కూడా ఇక మీదట ఆడే అన్ని మ్యాచ్ ల్లో గెలుస్తూ రన్ రేట్ ని కూడా చాలావరకు మెరుగుపరుచుకుంటూ వస్తేనే వాళ్లు కూడా సెమిస్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.బంగ్లాదేశ్ టీమ్ మాత్రం ఇప్పటికే ఐదు మ్యాచ్ లు ఆడి నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయి ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచింది.కాబట్టి బంగ్లాదేశ్ కి సెమీస్ కి వెళ్లే అవకాశాలు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. ఇక మిగతా టీంల పరిస్థితి కూడా ఎలా ఉంటుందనేది చూడాలంటే జరగబోయే మ్యాచ్ ల మీద ఆధారపడి ఉంటుంది….
ఇక ప్రస్తుతం ఉన్న టీమ్ ల్లో ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి టీమ్ లు సెమీ ఫైనల్ లో మొదటి మూడు బెర్తులను కన్ఫర్మ్ చేసుకోగా ఇక నాల్గోవ పొజిషన్ కోసం మిగిలిన టీమ్ లు పోటీ పడుతున్నాయి…