Odi World Cup 2023: వరల్డ్ కప్ లో ప్రతి టీం కూడా తనదైన రీతిలో మ్యాచ్ లను గెలిచి వాళ్ల టీం కి వరల్డ్ కప్ అందించాలనే సంకల్పంతోనే ప్రతి జట్టు కూడా బరిలోకి దిగుతుంది. అయితే ఇప్పుడు కూడా అదే కాన్ఫిడెంట్ తో అన్ని జట్లు బరిలోకి దిగాయి.
ఆ క్రమంలో ఇండియన్ టీం కూడా ఇప్పుడు వరుస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక పెద్ద జట్ల విషయంలో అన్ని టీంలు కూడా మంచి విజయాలను సాధిస్తాయి అనుకున్న క్రమంలో కొన్ని చిన్న జట్లు పెద్ద జట్లకి షాక్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ వరల్డ్ కప్ లో చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ టీం, ఇంగ్లాండ్ టీమ్ ని చిత్తుగా ఓడించింది. అలాగే సౌతాఫ్రికా లాంటి పెద్ద జట్టుని కూడా నెదర్లాండ్ టీం చిత్తు చేయడం మనం చూసాం… అయితే చిన్న జట్లు అనేవి పెద్ద జట్లను ఓడించడం అనేది ఇప్పుడే జరగడం లేదు. ఇంతకుముందు కూడా చాలాసార్లు పెద్ద జట్టు చిన్న జట్ల చేతుల్లో ఓడిపోవడం జరిగింది.
2007వ సంవత్సరం వరల్డ్ కప్ లో ఇండియా టీం బంగ్లాదేశ్ టీమ్ మీద ఓడిపోయింది. ఇక ఆ క్రమం లోనే ఇండియా సెమీస్ కి వెళ్లకుండా లీగ్ దశలోనే వెనుతిరగాల్సి వచ్చింది. అలా ఇండియన్ టీం సెమిస్ ఆశలను కోల్పోయేలా చేసి బంగ్లాదేశ్ టీం మన టీమ్ కి షాకిచ్చింది…ఇప్పటివరకు ఒకప్పుడు రెండు సార్లు ఆస్ట్రేలియా వరుసగా రెండు వరల్డ్ కప్ లను గెలిచి చరిత్ర సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే.అలాంటి ఆస్ట్రేలియా టీం కూడా 2007 t20 వరల్డ్ కప్ లో జింబాబ్వే చేతిలో దారుణమైన ఓటమిని చవిచూసింది. ఆస్ట్రేలియా కూడా జింబాబ్వే చేతిలో ఓడిపోవడంతో క్రికెట్ లో ఎవరు బలమైన టీం కాదు. ఎంత బలమైన టీమ్ ని అయిన చిన్న టీమ్ చేతుల్లో ఓడిపోక తప్పదు అనే విషయాన్ని పసికూనలు సాధించిన విజయాలను చూస్తే అర్థమవుతుంది.
ఇక పాకిస్తాన్ కూడా ఓటమిని చవిచూసింది. 2007లో ఐర్లాండ్ మీద పాకిస్థాన్ ఓడిపోవడం జరిగింది. ఇక 2003 వరల్డ్ కప్ లో శ్రీలంక టీం కెన్యా టీం ని చిత్తు చేసింది.ఈ దశలో శ్రీలంకని ఓడించాక కెన్యా సెమీఫైనల్ లోకి వచ్చే అవకాశాలు కూడా భారీగానే ఉండేవి కానీ వర్షం కారణంగా కెన్యా జట్టు సెమీస్ లోకి రాలేకపోయింది. ఇలా బలమైన టీం మీద బలహీనమైన చిన్న జట్లు కూడా విజయాలు సాధించిన రోజులు చాలా ఉన్నాయి.కాబట్టి మ్యాచ్ లు ఆడడం వరకే టీములు చేసే పని అది గెలుస్తామా, ఓడుతామా అనేది ఎవరికీ తెలియదు. ఈ వరల్డ్ కప్ లో కూడా చిన్న టీమ్ లు విజయాలు సాధించి పెద్ద జట్ల సెమిస్ ఆశల మీద నీళ్లు జల్లుతున్నాయి. ఇక మొత్తం మ్యాచు లు ముగిస్తే గాని ఏ జట్టు సెమిస్ కి వెళ్తుంది. అనేది చెప్పే అవకాశం అయితే లేదు…ఎందుకంటే రోజుకొక చిన్న టీమ్ విజయం సాధిస్తూ ఇక్కడ అందరిని ఆశ్చర్య పరుస్తుంది…