Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో ఈ వారం షాకింగ్ గా ఎలిమినేషన్.. ఎవరో తెలిస్తే అన్యాయం అంటారు

నిజానికి గత వారం ఓటింగ్ లో శోభా శెట్టి వెనుకబడినట్లు తెలిసింది. ఓవర్ యాక్షన్ సీరియల్ బ్యాచ్ నుండి ఆమె ఎలిమినేట్ అవుతుందని భావించారు. అనూహ్యంగా నయని పావని ఇంటిని వీడింది.

Written By: NARESH, Updated On : October 22, 2023 10:27 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 అట్టర్ ప్లాప్. దారుణమైన రేటింగ్ రాబట్టింది. దీంతో మేకర్స్ లేటెస్ట్ సీజన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. షో సరికొత్తగా ప్లాన్ చేశారు. చెప్పాలంటే సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతుంది. కాగా రెండు వారాల క్రితం వైల్డ్ కార్డుతో అంబటి అర్జున్, పూజా మూర్తి, నయని పావని, అశ్విని, భోలే హౌస్లో అడుగుపెట్టారు. గత వారం నయని పావని ఎలిమినేట్ అయ్యింది. ఒక్క వారం లోనే ఆమె ఇంటిని వీడాల్సి వచ్చింది. నయని పావని ఇంత త్వరగా ఎలిమినేట్ కావాల్సింది కాదు. ఆమె బాగా ఆడుతుందని ఆడియన్స్ అభిప్రాయ పడ్డారు.

నిజానికి గత వారం ఓటింగ్ లో శోభా శెట్టి వెనుకబడినట్లు తెలిసింది. ఓవర్ యాక్షన్ సీరియల్ బ్యాచ్ నుండి ఆమె ఎలిమినేట్ అవుతుందని భావించారు. అనూహ్యంగా నయని పావని ఇంటిని వీడింది. ఈవారం మరో వైల్డ్ కార్డు ఎంట్రీపై వేటుపడిందని అంటున్నారు. అమర్ దీప్, భోలే, ప్రశాంత్, తేజా, గౌతమ్, అశ్విని, పూజా ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

వీరిలో అతి తక్కువ ఓట్లు పొందిన పూజా మూర్తి ఎలిమినేట్ అయ్యిందని అంటున్నారు. నిజానికి పూజా మూర్తి షో ప్రారంభంలోనే ఎంట్రీ ఇవ్వాల్సింది. చివరి క్షణంలో పూజా తండ్రి మరణించాడు. దాంతో ఆమె ఆగిపోయారు. వైల్డ్ కార్డు ద్వారా ఐదు వారాల అనంతరం షోలో పాల్గొంది. బిగ్ బాస్ షోలో పాల్గొనడం తన తండ్రి కోరిక. హౌస్లోకి వెళుతున్నాని తెలిసి ధైర్యం చెప్పారు. భయపడకుండా ఆడు, మేము నిన్ను రోజూ చూస్తూనే ఉంటాం… అన్నారు.

ఆయన కల నెరవేర్చేందుకే నేను షోకి వచ్చానని పూజా మూర్తి చెప్పింది. రెండు వారాలకే పూజా ఎలిమినేట్ అవుతున్న తరుణంలో తండ్రి కల చెదిరినట్లు అయ్యింది. ఇవాళ ఎలిమినేట్ అయ్యేది పూజా అని విశ్వసనీయ సమాచారం. చూస్తుంటే వైల్డ్ కార్డు ఎంట్రీలను కేవలం ఎలిమినేషన్స్ కోసమే పిలిచినట్లు ఉంది. అర్జున్ అంబటిని మినహాయించి భోలే, అశ్వినిలను కూడా త్వరలో పంపిస్తారు అనిపిస్తుంది.