https://oktelugu.com/

Krithi Shetty: అమ్మో గ్లామర్ డోస్ పెంచేసిన ఉప్పెన కృతి శెట్టి… ఆఫర్స్ కోసమేనా ఈ ఆరాటం! వైరల్ ఫొటోలు

నానికి జంటగా శ్యామ్ సింగరాయ్ చిత్రం చేసింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. 2022 సంక్రాంతి విన్నర్ బంగార్రాజు మూవీతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. లక్కీ హీరోయిన్ ట్యాగ్ తో కృతి దూసుకుపోతున్న తరుణంలో వరుస ప్లాప్స్ పడ్డాయి.

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2023 / 10:15 AM IST
    Follow us on

    Krithi Shetty: ఉప్పెన మూవీతో సునామీ కెరటంలా ఆకాశాన్ని తాకింది కృతి శెట్టి ఇమేజ్. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఉప్పెన వంద కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటింది. మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఉప్పెనలో కృతి క్యూట్ లుక్ హైలెట్ అని చెప్పాలి. దేవిశ్రీ సాంగ్స్ చిత్ర విజయంలో కీలకం అయ్యాయి. ఉప్పెన కృతికి వరుస ఆఫర్స్ తెచ్చిపెట్టింది.

    నానికి జంటగా శ్యామ్ సింగరాయ్ చిత్రం చేసింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. 2022 సంక్రాంతి విన్నర్ బంగార్రాజు మూవీతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. లక్కీ హీరోయిన్ ట్యాగ్ తో కృతి దూసుకుపోతున్న తరుణంలో వరుస ప్లాప్స్ పడ్డాయి. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి నిరాశపరిచాయి.

    కస్టడీ మూవీతో మరో ప్లాప్ ఖాతాలో వేసుకుంది. నాగ చైతన్య హీరోగా అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం నిరాశపరిచింది. దీంతో కృతి టాలీవుడ్ లో ఆఫర్స్ నెమ్మదించాయి. అదే సమయంలో శ్రీలీల కుమ్ముడు మొదలైంది. కృతి శెట్టిని పక్కన పెట్టి టాలీవుడ్ ఆమె వెనుకపడుతుంది. ప్రస్తుతం కృతి తెలుగులో చేస్తున్న ఒకే ఒక చిత్రం శర్వానంద్ 35. హీరో శర్వానంద్ కూడా ఫార్మ్ లో లేడు. ఆయన క్లీన్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది.

    అయితే కృతికి ఇతర పరిశ్రమల్లో ఆఫర్స్ వస్తున్నాయి. ఆమె కోలీవుడ్ లో బిజీ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జయం రవికి జంటగా జీనీ టైటిల్ తో ఓ మూవీ చేస్తుంది. అలాగే కార్తీ నెక్స్ట్ మూవీకి ఆమె సైన్ చేశారట. మలయాళంలో ఓ మూవీ చేస్తుంది. దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఎదిగిన టాలీవుడ్ లో స్టార్ అయ్యే ఛాన్స్ ఆమె తృటిలో కోల్పోయింది. ఎలాగైనా కమ్ బ్యాక్ కావాలని అంటుకుంటుంది. ఈ క్రమంలో గ్లామర్ డోస్ పెంచుతుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది. కృతి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి..