Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ టీమ్ తను ఆడిన మొదటి రెండు మ్యాచ్ ల్లో మంచి విజయాలను అందుకుంది.ఇక ఆ తర్వాత ఇండియా, ఆస్ట్రేలియా మీద ఆడిన రెండు మ్యాచ్ లు కూడా వరుసగా ఓడిపోవడం జరిగింది.
అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో పాకిస్తాన్ టీం ని చాలామంది క్రికెట్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. దేనికి అంటే ఇండియాలో జరిగే వరల్డ్ కప్ కి ముందు ఆ టీం కెప్టెన్ అయిన బాబర్ అజమ్ మేము ఇండియాకి వెళ్తున్నాం కప్పుతోనే తిరిగి వస్తాం , మాకు కప్పు ఎలా సాధించాలో తెలుసు , ప్రపంచం లో ఉన్న క్రికెట్ టీములన్నిటికంటే మా టీమే చాలా స్ట్రాంగ్ గా ఉంది అంటూ రక రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఇక దానికి తగ్గట్టు గానే పాకిస్థాన్ బోర్డ్ కూడా మా టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఓడించే వారు ఎవరూ లేరు అన్న రేంజ్ లో మాట్లాడుతూ ఇండియన్ టీమ్ కి కోహ్లీ ఉంటే, మా పాకిస్తాన్ టీం కి బాబర్ అజమ్ లాంటి ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్ ఉన్నాడు అంటూ చాలా గొప్పలు పలికింది.
ఇక ఈ క్రమంలో పాకిస్తాన్ ఇప్పుడు వరుసగా ఓటమి పాలవుతూ ఉండటంతో వాళ్లు మాట్లాడిన మాటలను అన్ని దేశాల అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్ నెదర్లాండ్స్, శ్రీలంక లాంటి చిన్న జట్ల మీద మ్యాచ్ లను గెలిచింది. కానీ ఇండియా, ఆస్ట్రేలియా టీమ్ ల మీద ఓడిపోయి వాళ్ళ ఫెలవమైన పర్ఫామెన్స్ ని మరోసారి కంటిన్యూ చేసింది. ఇక పాకిస్తాన్ టీం ఎలా ఉన్నా కూడా ఎప్పుడూ ఇండియాతో పోల్చుకుంటూ మేము ఇండియాకు ఏమాత్రం తక్కువగా లేము, మా టీం కూడా స్ట్రాంగ్ టీమ్ అంటూ ఎప్పటికప్పుడు వాళ్ల టీమ్ ని వాళ్లకు వాళ్లే పోగుడుకుంటూ ఉంటారు.
నిజానికి పాకిస్థాన్ టీమ్ లో మంచి ప్లేయర్లు ఉన్నప్పటికీ వాళ్ళు ఎప్పుడు ఎలా అడుతారో ఎవ్వరికీ తెలీదు. అందుకే ఆ టీమ్ వరుస ఓటములను చవిచూడాల్సి వస్తుంది. నిజానికి క్రికెట్ టీమ్ పరంగా ఇండియా కి పాకిస్థాన్ కి మధ్య నక్క కి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అయినప్పటికీ వాళ్ళు ఎప్పడూ ఇండియా మీదనే పడి ఏడుస్తూ ఉంటారు…
ఇక పాకిస్థాన్ ప్లేయర్లు అందరు కూడా వరుసగా ఫెయిల్ అవుతూ ఉండటం నిజంగా వాళ్ళ ఫెయిల్యూర్ కి కారణం అనే చెప్పాలి. రీసెంట్ గా ఆస్ట్రేలియా మీద ఆడిన మ్యాచ్ లో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఇద్దరు సెంచరీలు చేసి పరుగుల వరద పారించి పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు…..ఇక ఇప్పటి నుంచైనా డబ్బాలు కొట్టకుండా కామ్ గా వాళ్ల మ్యాచ్ లు వాళ్ళు ఆడితే బెటర్ అని క్రికెట్ అభిమానులు పాకిస్థాన్ టీమ్ మీద కౌంటర్లు వేస్తున్నారు…