South Africa vs Netherlands : వరల్డ్ కప్ లో భాగంగా చాలా మ్యాచులు జరుగుతున్నాయి. కొన్ని టీములు వరుసగా మ్యాచ్ లను గెలుచుకుంటూ ముందుకు పోతుంటే మరికొన్ని చిన్న టీములు కూడా పెద్ద టీంలకు భారీ షాక్ లను ఇస్తూ వాళ్లపైన ఆధిపత్యాన్ని చూపిస్తూ వాళ్లు కూడా వరుసగా విజయాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా ఇండియా టీం ఇప్పటికే వరుసగా మూడు విజయాలను అందుకొని ముందుకు దూసుకుపోతుంటే సౌతాఫ్రికా లాంటి టీం ఇప్పటికే వరుసగా రెండు విజయాలను అందుకుంది. కానీ నిన్న నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ఇక ఇంతకుముందు సౌతాఫ్రికా టీమ్ శ్రీలంక , ఆస్ట్రేలియా జట్ల మీద తమ ఆధిపత్యం చూపించినప్పటికీ సౌతాఫ్రికా టీమ్ నెదర్లాండ్స్ మీద ఓడిపోవడంతో వరల్డ్ కప్ లో ఏ టీమ్ ఎప్పుడు ఎవరిని ఓడిస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇక మొన్నా ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య తేమల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ లాంటి భారీ టీమ్ ఒక చిన్న జట్టు అయిన ఆఫ్గనిస్తాన్ టీమ్ మీద ఓడిపోవడం ఆ మ్యాచ్ చూసే ప్రేక్షకులకు సైతం షాక్ కి గురి చేసింది. ఇక నిన్నటి వరకు సౌతాఫ్రికా టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది సెమీస్ రేస్ లో కూడా ఉంది అని అందరూ అనుకున్నారు.కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో వాళ్ల ఆట తీరును చూసిన ప్రతి ఒక్కరు సౌతాఫ్రికా సెమీస్ కి వెళుతుంది అంటే డౌటే అనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా టీం మొదట బౌలింగ్ తీసుకుంది. ఇక ముందు బ్యాటింగ్ కి వచ్చిన నెదర్లాండ్స్ టీంలో ఓపెనర్లు పెద్దగా ఆకట్టుకోనప్పటికీ నెదర్లాండ్ టీమ్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ అయిన ఎడ్వర్డ్స్ 69 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత వండర్ మెర్వే 29 పరుగులు చేశాడు. అలాగే అయాన్ దత్ చివర్లో 23 పరుగులు చేసి నెదర్లాండ్ టీం 245 లాంటి ఒక గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారు.
చివర్లో అయాన్ దత్ 3 సిక్స్ లు కొట్టి సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు…ఇక సౌతాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగిడి,మాక్రో జాన్సన్, రబడ ముగ్గురు తలో రెండు వికెట్లు తీయగా, కోట్ జీ, మహారాజ్ ఇద్దరూ తలో వికెట్ తీశారు.ఇక 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా టీం కి ఓపెనర్లు పెద్దగా శుభారంబాన్ని అందించడం లో ఫెయిల్ అయ్యారు. ఇక ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో సెంచరీలు చేసిన డికాక్ ఈ మ్యాచ్ లో లాంగ్ ఇన్నింగ్స్ ఆడడంలో ఫెయిల్ అయ్యాడు.
సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ లో మిల్లర్ 43 పరుగులు చేయగా, మహారాజ్ 40 పరుగులు చేశారు.ఇక మిగిలిన వారు ఎవరు కూడా పెద్దగా రాణించకపోవడంతో సౌత్ఆఫ్రికా టీం 207 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇక ఈ విషయంలో నెదర్లాండ్ బౌలర్లను మెచ్చుకోవచ్చు.
ఎందుకంటే ఒక బలమైన సౌతాఫ్రికా జట్టును చూసి వాళ్ళు భయపడకుండా వాళ్ల పూర్తి ఎఫర్ట్ పెట్టి అద్భుతంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికా టీం బ్యాట్స్ మెన్స్ లని వరుసగా ఫెవిలియన్ కి పంపించారు. ఇక దాంతో నెదర్లాండ్ పైన సౌతాఫ్రికా ఓడిపోక తప్పలేదు. ఇక నెదర్లాండ్ బౌలర్లలో లోగాన్ వన్ బీక్ మూడు వికెట్లు తీశాడు…ఇక మీక్రీన్, వండర్ మెర్వే, లీడే ముగ్గురు కూడా తలో రెండు వికెట్లు తీశారు.. అకెర్ మెన్ ఒక వికెట్ తీశాడు… దాంతో వీళ్ళందరూ కలిసి నెదర్లాండ్ టీమ్ కి ఒక ఘన విక్టరీని సాధించి పెట్టారు. దీంతో సెమిస్ రేస్ లో ఉందనుకున్న సౌతాఫ్రికా టీం ఇలా ఓడిపోవడం మిగిలిన జట్లకి చాలా వరకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి…
*సౌతాఫ్రికా ఓటమిపై నెటిజన్ల సెటైర్లు వైరల్ అవుతున్నాయి..
South Africa Batting Lineup against Netherlands Bowlers #SAvsNED #SAvNED #NEDvsSApic.twitter.com/3RS1SUmsR4
— Shubham (@DankShubhum) October 17, 2023
#SAvsNED #SAvNED
Temba bavuma after watching the performance of South Africa against Netherlands pic.twitter.com/ZD65jOT4NU— ⭐ (@kingsuper1816) October 17, 2023