Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా ఇప్పటికే వరుస విజయాలను అందుకొని సెమీస్ రేస్ లో ముందు వరుసలో ఉంది.ఇక ఈ టోర్నీ లో ఇండియన్ టీం ప్లేయర్స్ మంచి పర్ఫామెన్స్ ఇచ్చి ప్రపంచ దేశాలను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలో భారత ఆల్ రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా చీలమండ గాయంతో న్యూజిలాండ్ మ్యాచ్ కి దూరం దూరమయ్యాడు. ఇక ఇదే క్రమంలో ఆయన రెండు రోజుల్లో పూర్తిగా కోల్కొని మళ్లీ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టనున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఇండియా తన తర్వాత మ్యాచ్ ఇంగ్లాండ్ తో ఆడబోతున్న సమయంలో ఇండియా ఆల్రెడీ సెమి ఫైనల్ కు అర్హతను సాధించే దిశ లో ఉంది కాబట్టి హార్దిక్ పాండ్యా జరగబోయే నాలుగు మ్యాచ్ లకి దూరంగా ఉండనున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సెమీఫైనల్ లో హార్థిక్ పాండ్యా అవసరం టీమిండియా కి భారీగా ఉంటుంది కాబట్టి అప్పటివరకు రెస్ట్ ఇస్తే హర్ధిక్ పాండ్య తొందరగా కోలుకుంటాడు. దాంతో ఆయన సెమీస్ లో ఆడే మ్యాచ్ ల్లో కీలకపాత్ర వహించే అవకాశం ఉంటుంది కాబట్టి జరగబోయే నాలుగు మ్యాచ్ లకి ఆయన్ని దూరంగా పెట్టినట్టు తెలుస్తుంది.
అయితే ఇంగ్లాండ్ టీమ్ కూడా ప్రస్తుతం వరుస ఓటమిలతో ఉంది కాబట్టి ఇండియా లాంటి ఒక బలమైన టీం ని ఓడించడం ఇంగ్లాండ్ టీమ్ వల్ల కాదు కాబట్టి హార్దిక్ పాండ్యా టీం లో లేకపోయినా ఇండియా టీం కి పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదని అందుకే అతనికి రెస్ట్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి హార్థిక్ పాండ్యా కొన్ని ఇంజక్షన్స్ తీసుకుంటే తను చాలా తొందరగా క్యూర్ అవుతాడు. కానీ సహజంగానే ఆయన కోలుకోవాలని బీసీసీఐ వైద్య బృందం చర్యలు తీసుకుంటుంది.
ఇక అందులో భాగంగానే హర్ధిక్ పాండ్యా ప్లేస్ లో సూర్య కుమార్ యాదవ్ మరోసారి బరిలోకి దిగనున్నట్టుగా తెలుస్తుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ఇండియా వరుసగా 6 విజయలను సాధించి సెమీస్ కి క్వాలిఫై అవుతుంది. అందుకే ఈ మూడు, నాలుగు మ్యాచ్ ల్లో హార్దిక్ పాండ్యా కి రెస్ట్ ఇచ్చి డైరెక్ట్ గా సెమీఫైనల్ లో బరిలోకి దింపుదామని ఇండియన్ టీమ్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ అనుకుంటున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఈసారి ఇండియా కప్పు కొట్టడం తధ్యం అని ఇప్పటికే చాలా మంది సీనియర్ ప్లేయర్లు జోష్యం చెప్తున్నారు…