Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో సంవత్సరాలుగా తన నటనా సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ముందుకు వెళుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు ఇప్పటికీ తన రేంజ్ ను అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. ఇక ఏ సినిమా ఒప్పుకున్నా.. పూర్తి పర్ఫామెన్స్ ఇస్తుంటారు. ప్రతి సీన్ ను ఎంతో కష్టపడి చేస్తుంటారు ఈ స్టార్ నటుడు. అంతే కాదు స్టంట్స్ తనే స్వయంగా డుప్ ను వాడకుండా చాలా కష్టపడి చేస్తుంటారు. కానీ ఎంత కష్టమైనా ఇష్టంగానే చేయడం ఆయనకు అలవాటు.
ఈయనకు సీనియర్ ఎన్టీఆర్ ఓ మాట చెప్పారట. అది ఇప్పటికీ తూ.చా తప్పకుండా పాటిస్తుంటారు బాలయ్య. ప్రతి క్యారెక్టర్ లో ఉండే మూవ్ మెంట్ ను ఇన్వాల్వ్ అవుతూ చేయాలి అన్నారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే స్టాటజీ ఫాలో అవుతున్నారు బాలయ్య. అందుకే బాలయ్య బాబు కెరియర్ లో నటించిన ప్రతి సినిమాలో కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అవుతూ నటిస్తుంటారు..ముఖ్యంగా ఆదిత్య 369, భైరవద్వీపం సినిమాలో ఆయన నటించిన నటన పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నట్టు చాలా సందర్భాల్లో తెలియజేశాడు. ఎందుకంటే ఈ రెండు సినిమాల్లోని క్యారెక్టర్ లో కూడా తనని తాను ఎలా అయితే యాక్టింగ్ చేయగలడో ఒక టాస్క్ లాగా పెట్టుకుని వైవిధ్యమైన నటన కనబరుస్తూ ఈ రెండు సినిమాలను విజయతీరాలకి చేర్చాడు.
ఈ రెండు సినిమాల్లోని బాలయ్య పాత్రకు తన రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమాల వల్ల ఊహించని క్రేజ్ వచ్చింది కూడా. ముఖ్యంగా ఈ రెండు సినిమాల డైరెక్టర్ కూడా సింగీతం శ్రీనివాసరావు కావడంతో బాలయ్య బాబు కెరియర్లో ది బెస్ట్ మూవీస్ గా నిలిచిపోయాయి. ఇప్పటికీ ఎప్పటికీ బాలయ్య బాబు కెరీర్ లో ఒక పది క్యారెక్టర్లలో ఈ రెండు సినిమాల్లోని క్యారెక్టర్లు మాత్రం తప్పకుండా అతనికి గుర్తు ఉంటాయని బాలయ్య బాబు ఒక ఇంటర్వ్యూలో కూడా తెలియజేశారు. ఇలా ఎన్ని సినిమాలు చేసి కలెక్షన్లు భారీగా వసూలు చేసిన సినిమాలు ఉన్నా కూడా బాలయ్య ఈ రెండు సినిమాల గురించి చెప్పడంతో ఆశ్యర్యపోతుంటారు ఆయన అభిమానులు.