Odi World Cup 2023: ఇండియాని భయపెడుతున్న నాకౌట్ మ్యాచ్…భయాలు వద్దు ఈసారి కప్పు మనదే అంటున్న రోహిత్…

సెమీ ఫైనల్ లో ఇండియన్ టీం తో తలపడే టీమ్ ఏది అనేది చాలా రోజులుగా అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. ఇలాంటి క్రమంలో నిన్న న్యూజిలాండ్ శ్రీలంక మీద మ్యాచ్ గెలిచిన తర్వాత దాదాపు సెమీ ఫైనల్స్ లో బెర్త్ అయితే కన్ఫామ్ చేసుకుంది.

Written By: Gopi, Updated On : November 10, 2023 12:14 pm

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: వరల్డ్ కప్ భాగంగా ప్రస్తుతం ఇండియన్ టీం వరుసగా మ్యాచ్ లను గెలుస్తూ వస్తుంది.అందులో భాగంగానే ఇండియా ఫస్ట్ పొజిషన్ లో కొనసాగుతుంది.ఇక నెదర్లాండ్స్ తో అదే ఒక మ్యాచ్ బ్యాలెన్స్ ఉండటం తో ఈ నెల 12 వ తేదీన ఇండియా ఆ మ్యాచ్ ని అడనుంది ఇక అదే ఈ టోర్నీ మొత్తానికి లీగ్ దశ లో చివరి మ్యాచ్ కావడం విశేషం…ఇక ఇప్పుడు సెమీ ఫైనల్ లో ఇండియన్ టీం తో తలపడే టీమ్ ఏది అనేది చాలా రోజులుగా అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. ఇలాంటి క్రమంలో నిన్న న్యూజిలాండ్ శ్రీలంక మీద మ్యాచ్ గెలిచిన తర్వాత దాదాపు సెమీ ఫైనల్స్ లో బెర్త్ అయితే కన్ఫామ్ చేసుకుంది. దాంతో ఇండియన్ టీం తో సెమీ ఫైనల్ ఆడే టీమ్ న్యూజిలాండ్ అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది…

ఎందుకంటే దానితో పాటు పోటీ పడుతున్న మరో టీమ్ అయిన పాకిస్తాన్ ఇంగ్లాండ్ తో ఆడబోయే మ్యాచ్ లో భారీ విజయాన్ని సాధించాలి దాదాపు 274 పరుగుల తో గెలవాలి అలా గెలవడం మాక్సిమం సాధ్యం అవ్వదు.కాబట్టి ఇప్పటికైతే న్యూజిలాండ్ టీమ్ సెమీఫైనల్ రేసు లో కొనసాగుతుంది. ఇక అఫీషియల్ ఇండియన్ టీమ్ సెమీస్ కి క్వాలిఫై అవ్వాలంటే మాత్రం ఇంగ్లాండ్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ అయిపోయేంత వరకు వెయిట్ చేయాలి. అయినప్పటికీ న్యూజిలాండ్ టీం గానీ ఇండియన్ టీం గానీ రెండు కూడా సెమీఫైనల్ రేస్ కి సిద్ధమవుతున్నాయి.ఇక ఇదే సందర్భంలో ఇండియన్ టీం భారీ మార్పులను చేస్తూ న్యూజీలాండ్ ని కట్టడి చేయడానికి భారీ వ్యూహాలను రచిస్తుంది ఇక దాని మీదనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంది.ఈ టోర్నీ లో ఇక ఆల్రెడీ న్యూజిలాండ్ ని లీగ్ దశలో ఒకసారి ఓడించారు కాబట్టి ఇండియా మళ్లీ న్యూజిలాండ్ ని ఓడించడం పెద్ద మ్యాటర్ అయితే కాదు…అదేవిధంగా న్యూజిలాండ్ కూడా ఇప్పటివరకు లీగ్ దశలో మ్యాచ్ ని ఓడిపోయింది కాబట్టి ఎలాంటి మార్పులు చేస్తే మనం సెమీఫైనల్ లో గెలవచ్చు అనే దాని మీదనే ఇప్పుడు చాలా రకాలైన వ్యూహాలు రచిస్తుంది…

ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇప్పటి వరకు ఇండియన్ టీమ్ న్యూజిలాండ్ పైన నాకౌట్ మ్యాచ్ ల్లో విజయాలు సాధించింది లేదు.2016 వ సంవత్సరం నుంచి అయితే వరుసగా అన్నీ నౌకట్ మ్యాచ్ ల్లో ఇండియా ఒడిపోతునే వస్తుంది.2016 నుంచి ఐదు సార్లు ఇండియన్ న్యూజిలాండ్‌తో నాకౌట్ మ్యాచ్ లు ఆడితే అందులో అన్నింట్లో ఇండియా ఓడిపోతునే ఉంది…

వన్డే వరల్డ్ కప్ అయిన 2019 లో కూడా సెమీస్ లో ఇండియా చివరి వరకు పోరాడి ఓడిపోవడం మన చూసాం..2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లోనూ విజయం ఇండియా ఓడిపోవడం జరిగింది. ఆ సంవత్సరం లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లోను భారత్ న్యూజిలాండ్ చేతిలోనూ ఓడిపోయింది.అయితే ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఎదురవ్వచ్చు అని అందరూ అనుకుంటున్నారు కానీ ఈ సారి మాత్రం అది జరగదు ఎందుకంటే ఇండియన్ టీమ్ ఇప్పుడు చాలా మంచి ఫామ్ లో ఉంది…ఇక ఇప్పటికే రోహిత్ శర్మ సెమీస్ లో న్యూజిలాండ్ ని చిత్తు గా ఓడించి ఫైనల్ కి వెళ్లి అక్కడ కూడా గెలిచి కప్పు అందుకుంటామ్ అనే ధీమా ని వ్యక్తం చేస్తున్నాడు…