https://oktelugu.com/

Adipurush: బ్లాక్ బస్టర్ హిట్ ను సంపాదించిన ఆదిపురుష్.. అవును మీరు విన్నది నిజమే..

స్టార్ మా ఛానెల్ లో ఆదిపురుష్ సినిమాను ప్రచారం చేశారు యాజమాన్యం. ఈ సినిమాకు ఏకంగా సిటీలో 9.5 రేటింగ్ వచ్చింది. ఈ రేంజ్ లో రేటింగ్ రావడం అంటే మామూలు విషయం కాదు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 10, 2023 12:09 pm
    Adipurush

    Adipurush

    Follow us on

    Adipurush: కొన్నిసార్లు ప్రేక్షకులు వెండితెర కంటే బుల్లితెరనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మరికొన్ని సార్లు బుల్లితెరపై కంటే వెండితెరపై మాత్రమే కొన్నిసినిమాలను చూడడానికి ఇష్టపడుతుంటారు. బుల్లితెర మీద ఏ సినిమా క్లిక్ అవుతుందో, వెండితెర మీద ఏ సినిమా క్లిక్ అవుతుందో చెప్పడం కూడా కష్టంగానే ఉంటుంది. గతంలో కాంతార సినిమా వెండితెరపై గూస్ బాంబ్స్ తెప్పిస్తే బుల్లితెరపై నార్మల్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇక థియేటర్లలో సూపర్ హిట్ అయిన వాల్తేరు వీరయ్య టీవీలో మాత్రం అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. కానీ థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఆదిపురుష్ సినిమా బుల్లితెరపై బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. నమ్మడం లేదా అయితే ఆ వివరాలు మీకోసం..

    స్టార్ మా ఛానెల్ లో ఆదిపురుష్ సినిమాను ప్రచారం చేశారు యాజమాన్యం. ఈ సినిమాకు ఏకంగా సిటీలో 9.5 రేటింగ్ వచ్చింది. ఈ రేంజ్ లో రేటింగ్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఈ మధ్య కాలంలో వచ్చిన రేటింగ్స్ ఆధారంగా చూసుకుంటే ఆదిపురుష్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పడంలో సందేహం లేదు. అయినా టీవీలో రేటింగ్ వస్తే హిట్టా అనుకుంటున్నారు కావచ్చు.. కానీ ఈ సినిమాను టెలికాస్ట్ చేసిన సమయంలోనే వరల్డ్ కప్ మ్యాచ్ కూడా వచ్చింది. మ్యాచ్ ను సైతం ఎదిరించి 9.5 రేటింగ్ రావడం విశేషం.

    థియేటర్లలో హిట్ అయినా ఏ సినిమాకు కూడా చెప్పుకోదగ్గ రేటింగ్ రాలేదనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య తో పాటు బ్రో, గాడ్ ఫాదర్, కార్తికేయ-2, సర్దార్ సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. బలగం, ధమాకా మాత్రమే కాస్త మెరిశాయి. వీటన్నింటిని తలదన్ని ఆదిపురుష్ సినిమా మంచి రేటింగ్ ను అందుకుంది. ప్రభాస్ నటించిన ఈ సినిమా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా హనుమంతుడి పాత్రధారితో చెప్పించిన డైలాగ్ అయితే వివాదాస్పదం అయింది. ఏకంగా కోర్టులో కేసుల వరకు వెళ్లింది. గ్రాఫిక్స్ అయితే చిన్న పిల్లలు చేశారా అనే రేంజ్ లో ఉన్నాయి. అలాంటి సినిమా బుల్లితెరపై ఈ రేంజ్ లో రేటింగ్ తెచ్చుకోవడం అంటే సక్సెస్ సాధించినట్టే అంటున్నారు నెటిజన్లు.