NZ vs SA : ఛాంపియన్ ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే తొలి సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడగా.. రోహిత్ సేన నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఫైనల్ చేరుకుంది. 2017లో టీమిండియా ఫైనల్ చేరుకున్నప్పటికీ.. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడి ఓడిపోయింది. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెట్టిన పాకిస్తాన్ గ్రూపు దశ లోనే నిష్క్రమించింది. ఇక టీమిండియా 2017 మాదిరిగానే ఈసారి కూడా ఫైనల్ వెళ్లిపోయింది.
Also Read : సౌతాఫ్రికాకు ఎంత కష్టమొచ్చే.. పాకిస్తాన్ లో ఆఖరుకు కోచ్ వచ్చి ఫీల్డింగ్ చేయబట్టే
దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచులు ఆస్ట్రేలియా పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అన్ని రంగాలలో బలమైన ఆస్ట్రేలియాతో తలపడి.. అదరగొట్టింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కి సిద్ధమైంది. ఇక గ్రూప్ బి లో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా సెమీ ఫైనల్ వెళ్లిపోయాయి. సెమి ఫైనల్ మ్యాచ్లో బుధవారం ఈ రెండు జట్లు పాకిస్తాన్ వేదికగా తలపడతాయి. గత చరిత్ర చూసుకుంటే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఇప్పటివరకు 73 వన్డే మ్యాచ్లలో పోటీ పడ్డాయి. న్యూజిలాండ్ 26 సార్లు, దక్షిణాఫ్రికా 42 సార్లు గెలుపులను సొంతం చేసుకున్నాయి. మిగతా ఐదు మ్యాచ్లలో ఫలితం తేలలేదు. 2023 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసి ఏకంగా 357 పరుగులు చేసింది. క్వింటాన్ డికాక్, వాన్ డేర్ డాసన్ సెంచరీలు చేశారు. 358 రన్స్ టార్గెట్తో రంగంలోకి దిగిన న్యూజిలాండ్ కేవలం 167 పరుగులకే ఆల్ అవుట్ అయింది..
దక్షిణాఫ్రికా కే అవకాశం
గత చరిత్ర చూసుకుంటే దక్షిణాఫ్రికాకే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ పై 107 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో జరగాల్సింది మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఇక ఇంగ్లాండ్ జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తర్వాత హైయెస్ట్ విన్నింగ్ పర్సంటేజ్ ను దక్షిణాఫ్రికా కొనసాగించింది. ఇక గత రికార్డులు కూడా దక్షిణాఫ్రికాకే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో.. న్యూజిలాండ్ తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ దక్షిణాఫ్రికా గనుక విజయం సాధిస్తే టీమిండియాతో ఆదివారం జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో తలపడుతుంది. 2024లో జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్, దక్షిణాఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. ఒకానొక దశలో దక్షిణాఫ్రికా విజయం సాధించేలాగా కనిపించింది. అయితే కీలక సమయంలో దక్షిణాఫ్రికా వికెట్లను కోల్పోవడంతో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2007 తర్వాత.. రెండోసారి టీమిండియా టి20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది.
గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం సౌత్ ఆఫ్రికాకు 54%, న్యూజిలాండ్ కు 46% విజయావకాశాలున్నాయి
Also Read : టాస్ గెలిచి పెద్ద తప్పు చేసిన న్యూజిలాండ్.. అదే సౌతాఫ్రికాకు విజయం