Anushka , Prabhas
Anushka and Prabhas : అనుష్క శెట్టికి పరిశ్రమలో మంచి పేరుంది. అనుష్క చాలా హంబుల్ గా ఉంటారు. నిర్మాతల హీరోయిన్ ఆమె. చాలా సౌమ్యంగా మాట్లాడతారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో అద్భుతమైన చిత్రాల్లో ఆమె నటించారు. అనుష్క నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అరుంధతి మైలురాయిగా మిగిలిపోయింది. ఇక బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో అనుష్క ఫేమ్ ఇండియా వైడ్ పాకింది. బాహుబలి 2 అనంతరం అనుష్క ఆచితూచి సినిమాలు చేస్తుంది. కాగా అనుష్కపై సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ సంచలన కామెంట్స్ చేశాడు. ఆమె ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా ఆయన ఆరోపణలు ఉన్నాయి.
Also Read : పిక్ ఆఫ్ ది డే : అంత దూరం పోయినా ప్రభాస్ వదలని అనుష్క.. వైరల్ ఫొటో
విషయంలోకి వెళితే.. గతంలో అన్ స్టాపబుల్ షోకి గెస్ట్స్ గా ప్రభాస్, గోపీచంద్ హాజరయ్యారు. హోస్ట్ బాలయ్య కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా అడిగాడు. మీరిద్దరూ ఒక అమ్మాయి కోసం గొడవపడ్డారట నిజమేనా అని బాలకృష్ణ అన్నాడు. ఈ ప్రశ్నకు అవును అన్నట్లు గోపీచంద్ తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో హింట్ ఇచ్చాడు. ఆ అమ్మాయి ఎవరో మాత్రం చెప్పలేదు. ఈ విషయాన్ని లేవనెత్తిన గీతా కృష్ణ.. ఆ అమ్మాయి అనుష్కనే. ఆమె కోసమే గోపీచంద్-ప్రభాస్ గొడవ పడ్డారంటూ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు.
ఆయన మాట్లాడుతూ.. మన అపార్ట్మెంట్ వెనకే గోపీచంద్-అనుష్క కలిసి ఉండేవారు. దాదాపు ఏడాది పాటు వాళ్ళు కలిసి ఉన్నారు. తర్వాత అనుష్క ప్రభాస్ కి దగ్గరైంది. దాంతో గోపీచంద్-ప్రభాస్ మధ్య గొడవలు తలెత్తయని, అన్నారు. గోపీచంద్, అనుష్క జంటగా లక్ష్యం, శౌర్యం చిత్రాల్లో నటించారు. ఇవి రెండు మంచి విజయాలు సాధించాయి. అప్పట్లో వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వచ్చాయి. గీతా కృష్ణ వారిద్దరూ ఏడాది కాలం కలిసి జీవించారని అంటున్నారు.
అనంతరం ప్రభాస్-అనుష్క ఎఫైర్ వార్తలు తెరపైకి వచ్చాయి. బాహుబలి 2 తర్వాత పెళ్లి కూడా చేసుకోనున్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లను ప్రభాస్ ఖండించారు. ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని అన్నారు. కాగా ప్రభాస్ వివాహం చేసుకోవడం లేదు. అదే సమయంలో అనుష్క కూడా పెళ్లి ఊసు ఎత్తడం లేదు. ప్రస్తుతం అనుష్క క్రిష్ దర్వకత్వంలో ఘాటీ టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది.
Also Read : అభిమాని కూతురికి అనుష్క పేరు పెట్టిన ప్రభాస్…