NZ vs PAK : ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ట్రై సిరీస్ కూడా పాకిస్తాన్ వేదికగానే జరిగింది. దానిని కూడా పాకిస్తాన్ అనుకూలంగా మలచుకోలేకపోయింది. ఆ సిరీస్లోనూ ఓటమిపాలైంది. ఇక తాజాగా న్యూజిలాండ్ దేశంలో.. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న టి20 సిరీస్ నూ పాకిస్తాన్ కోల్పోయింది. 3-1 తేడాతో న్యూజిలాండ్ జట్టు ఎదుట మోకరిల్లింది.. గత టి20 మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 200కు పైగా స్కోరును టార్గెట్ గా విధించగా.. పాకిస్తాన్ జట్టు ఉఫ్ మని ఊదేసింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు గాడిలో పడిందని అందరూ అనుకున్నారు. కానీ అదంతా ఆ మ్యాచ్ వరకేనని పాకిస్తాన్ ఆటగాళ్లు నిరూపించారు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన నాలుగో వన్డేలో పాకిస్తాన్ దారుణమైన ఓటమిని మూట కట్టుకుంది. భారీ పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కనీసం పోరాటం చేయకుండానే న్యూజిలాండ్ జట్టు ముందు తలవంచింది. మౌంట్ మౌంగనుయ్ వేదిక జరిగిన నాలుగో టి20 మ్యాచ్లో పాకిస్తాన్ అన్ని రంగాలలో విఫలమైంది.. న్యూజిలాండ్ విధించిన 221 రన్ టార్గెట్ ను చేదించడంలో 105 రన్స్ కే ఆల్ అవుట్ అయింది. 115 పరుగుల భారీవ్యత్యాసంతో న్యూజిలాండ్ జట్టు ఓటమిపాలైంది.. ఈ గెలుపు ద్వారా ఇంకో మ్యాచ్ ఉండగానే న్యూజిలాండ్ జట్టు సిరీస్ ను సొంతం చేసుకుంది.
Also Read : మారదు. మారేంత సీన్ లేదు.. ఎందుకంటే అది పాకిస్తాన్ జట్టు కాబట్టి..
పాపం పాకిస్తాన్
221 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఏ దశలోనూ విజయం సాధించే దిశగా కనిపించలేదు. ప్రారంభ ఆరు ఓవర్లలోనే పాకిస్తాన్ జట్టు 42 పరుగులకే 5 వికెట్లు నష్టపోయింది. గత మ్యాచ్లో సెంచరీ చేసిన హసన్ నవాజ్ కేవలం ఒకే ఒక్క పరుగుకు ఔట్ అయ్యాడు. మరోపేరు మహమ్మద్ హరీస్ రెండు పరుగులకే అవుట్ అయ్యాడు. కెప్టెన్ సల్మాన్ ఆఘా ఒక్క పరుగు చేసి పె విలియన్ చేరుకున్నాడు. ఫలితంగా పాకిస్తాన్ 9 పరుగులకు మూడు వికెట్లు నష్టపోయింది. ఈ దశలో షాదబ్ ఖాన్ (1), ఖుష్ దిల్ శా(6) సింగిల్ పరుగుకే అవుట్ అయ్యారు. ఇక చివర్లో అబ్దుల్ సమద్ (44) కాస్త బ్యాట్ కు పని చెప్పడంతో పాకిస్తాన్ ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. పాకిస్తాన్ చేసిన పరుగుల్లో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే రెండు అంకెల స్కోర్ లు చేయగలిగారు.. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. 20 ఓవర్లలో ఆర్ వికెట్లు మాత్రమే లాస్ అయి 220 రన్స్ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ ఓపినర్లు టీం సైఫర్ట్(44), ఫిన్ అలెన్(50) మెరుపు బ్యాటింగ్ చేశారు. చివర్లో న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్ వెల్ (46) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. తద్వారా న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. ఫిన్ అలెన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక రెండు జట్ల మధ్య నామమాత్రమైన చివరి వన్డే మార్చి 26న బుధవారం జరుగుతుంది.
Also Read : దేశం మారినా దారిద్య్రం మారలేదు.. పాపం పాకిస్తాన్..