https://oktelugu.com/

గాయాల బెడద.. 3వ టెస్టుకు టీమిండియా టీం ఇదే?

ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ కు గాయాల బెడద వేధిస్తోంది. మూడో టెస్టులో టీమిండియా ఏం టీంతో బరిలోకి దిగుతుందనేది ఆసక్తిగా మారింది. వరుసగా గాయాల బెడదతో టీమిండియా జట్టు బలహీన పడుతోంది. Also Read: మహేంద్ర సింగ్ ధోని ‘పంట’ పండింది! ఇప్పటికే గాయాలతో బౌలర్లు షమీ, ఉమేశ్ యాదవ్ లు వైదొలగారు. అంతకుముందే కోహ్లీ సెలవులు తీసుకొని వెళ్లిపోయాడు. ఆదివారం టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ కూడా గాయపడడం టీమిండియాను మరింత డిఫెన్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 5, 2021 / 08:37 PM IST
    Follow us on

    ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ కు గాయాల బెడద వేధిస్తోంది. మూడో టెస్టులో టీమిండియా ఏం టీంతో బరిలోకి దిగుతుందనేది ఆసక్తిగా మారింది. వరుసగా గాయాల బెడదతో టీమిండియా జట్టు బలహీన పడుతోంది.

    Also Read: మహేంద్ర సింగ్ ధోని ‘పంట’ పండింది!

    ఇప్పటికే గాయాలతో బౌలర్లు షమీ, ఉమేశ్ యాదవ్ లు వైదొలగారు. అంతకుముందే కోహ్లీ సెలవులు తీసుకొని వెళ్లిపోయాడు. ఆదివారం టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ కూడా గాయపడడం టీమిండియాను మరింత డిఫెన్స్ లోకి నెట్టింది.

    ఓపెనర్ మయాంక్ అగర్వాల్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ హనుమ విహారిలు వరుసగా విఫలం అవుతుండడంతో వీరి స్థానంలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లను ఈసారి ఆడించాలని మేనేజ్ మెంట్ భావించింది. అయితే రోహిత్ ఎంట్రీ ఖాయం కాగా.. కేఎల్ రాహుల్ తాజాగా మణికట్టు గాయంతో వైదొలగడం టీమిండియాను దెబ్బ తీసింది.

    Also Read: గంగూలీ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్

    ఇక ఇప్పుడు టీమిండియాలోకి బౌలర్ గా ఎవరిని తీసుకోవాలన్నది టీం మేనేజ్ మెంట్ కు అంతుచిక్కడం లేదు. ఉమేశ్ స్థానంలో శార్ధుల్ ఠాకూర్ ను తీసుకోవాలా? లేక నవదీప్ శైనికి చాన్స్ ఇవ్వాలా? అనే దానిపై టీమిండియా కసరత్తు చేస్తోంది. వీరిద్దరూ కాదు.. మూడో పేసర్ స్థానంలో యార్కర్ కింగ్ నటరాజన్ పేరు కూడా వినిపిస్తోంది. అతడు వైట్ డ్రెస్ తో ఫొటో షూట్ కూడా నిర్వహించడం ఆసక్తి రేపుతోంది.