spot_img
Homeట్రెండింగ్ న్యూస్ఆడపిల్ల పుట్టిందని ఫ్రీగా సెలూన్ సేవలు.. ఎక్కడంటే..?

ఆడపిల్ల పుట్టిందని ఫ్రీగా సెలూన్ సేవలు.. ఎక్కడంటే..?

Gwalior Salon

సాధారణంగా దేశంలో ఎక్కువ మంది మగపిల్లాడు పుట్టాలని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. పట్టణాల్లో ఇలాంటి ఆలోచనా ధోరణి లేకపోయినా పల్లెల్లో చాలామంది ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. కొందరు తల్లిదండ్రులు అయితే ఆడపిల్ల పుడితే విచారణ వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి మాత్రం తనకు ఆడపిల్ల పుట్టడంతో ఎంతో ఆనందించాడు. సెలూన్ ఓనర్ అయిన ఆ వ్యక్తి తనకు చెందిన మూడు షాపుల్లో ఫ్రీగా సెలూన్ సర్వీసులు అందించాడు.

Also Read: రావి చెట్టుకు పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

పూర్తి వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన సల్మన్ కు మూడు సెలూన్ షాపులు ఉన్నాయి. ఒక షాపులో తనే విధులు నిర్వహిస్తుండగా మిగిలిన రెండు షాపులలో మాత్రం సిబ్బందిని నియమించి షాపులను నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం వివాహమైన సల్మాన్ కు 2020 సంవత్సరం డిసెంబర్ నెల 26వ తేదీన ఆడపిల్ల జన్మించింది. ఆడిపిల్ల జన్మించిందని తెలిసిన వెంటనే సల్మాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Also Read: ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు.. ఏయే తేదీల్లో వస్తాయంటే?

అందరిలా కాకుండా విభిన్నంగా తన సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలని భావించాడు. నిన్నటి నుంచి తనకు ఉన్న మూడు షాపులలో ఉచితంగా సెలూన్ సేవలను అందిస్తున్నట్టు ప్రకటన చేశాడు. షాపుల దగ్గర బ్యానర్లను ఏర్పాటు చేసి నిన్న ఒక్కరోజే 80 మంది కస్టమర్లకు ఉచితంగా సర్వీసులు అందించాడు. ఈ విషయం మీడియా దృష్టికి రాగా సల్మాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

ఉచితంగా సెలూన్ సర్వీసులు అందించడం వెనుక ముఖ్యమైన కారణమే ఉందని.. ఈ విధంగా ఆడపిల్ల పుట్టుక ఎంతో సంతోషం, ఆనందం ఇస్తుందనే సందేశాన్ని ఇవ్వాలనుకున్నానని తెలిపారు. అమ్మాయి పుడితే స్వాగతం పలికి సంతోషం పంచుకోవాలే తప్ప ఎవరూ బాధ పడకూడదని సల్మాన్ సూచించాడు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version