Nitish Reddy: ధోనిని(Dhoni) అవమానించాడని వస్తున్న ఆరోపణలకు తెలుగు క్రికెటర్, సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) కీలక ఆటగాడు నితీష్ రెడ్డి స్పష్టత ఇచ్చాడు. ధోని అంటే తనకు ఇష్టమని, అతనిపై విపరీతమైన గౌరవం ఉందని.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రమంలో తనపై ఇలాంటి దుష్ప్రచారాలు చేయొద్దని వివరించాడు. అసలు ఇంటర్వ్యూలో ఏముందో చూడకుండానే.. ఎవరికి నచ్చినట్టు వారు వీడియోను ఎడిట్ చేసి.. పిచ్చి పిచ్చిగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Also Read: ICC T20 World Cup 2024 : అమెరికా, కెనడా అయితే ఏంటట.. భారత్, ఆసియా దేశాల ఆటగాళ్ళే దిక్కు
ఇటీవల నితీష్ రెడ్డి.. తెలుగు యువ హీరో కార్తికేయతో(Karthikeya) ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కార్తికేయ నటించిన భజే వాయువేగం సినిమా ప్రమోషన్ లో భాగంగా.. కార్తికేయ.. నితీష్ సరదాగా మాట్లాడుకున్నారు. క్రికెట్, ఇతర విషయాల గురించి చర్చించారు.. ఈ సందర్భంగా నితీష్ రెడ్డిని కార్తికేయ ఒక ప్రశ్న అడిగాడు. ” కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అలా కొందరికి ఆట మీద గ్రిప్ నాచురల్ గా వచ్చి ఉంటుందని అనిపిస్తుంది. మరికొందరిని చూస్తే తీవ్రంగా కష్టపడి, శ్రమించి దానిని ఓ
ఒడిసి పట్టారని తెలుస్తుంది. అయితే ఇందులో ఏది సక్సెస్ అవుతుంది” అని కార్తికేయ నితీష్ రెడ్డిని అడిగారు.. ఈ ప్రశ్నకు నితిష్ రెడ్డి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. మైదానంలో సానుకూల ఆలోచన విధానం చాలా ముఖ్యమని నితీష్ రెడ్డి అన్నారు.. ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ.. కీలక సమయంలో ఒత్తిడిని అధిగమించకపోతే ఫలితం ఉండదని పేర్కొన్నాడు..” విరాట్ కోహ్లీతో కంపేర్ చేస్తే ధోనికి అంత టెక్నిక్ ఉండదు. కానీ ధోని ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంటుంది. అందుకే శిఖర స్థాయి సమాన ఆటగాడిగా ఎదిగాడని” నితీష్ ఉదాహరణలతో వివరించాడు. ” అతడి బలం ఏంటో ధోనికి తెలుసు. ప్రతి మ్యాచ్ ను అత్యంత లోతుగా అధ్యయనం చేస్తాడు. అర్థం చేసుకుంటాడని” నితీష్ వ్యాఖ్యానించాడు.
Also Read: T20 World Cup 2024: పసికూన అనుకుంటే.. వెస్టిండీస్ చుక్కలు చూపించింది..
నితీష్ ధోని కి టెక్నిక్ లేదు అని చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా చర్చకు దారితీసాయి. చాలామంది ఈ వీడియోను వారి వారి సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేసి.. నితిష్ రెడ్డిని ఏకి పారేయడం మొదలుపెట్టారు. ధోనిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు..”టికెట్ తెలియకుండానే టీమిండియా కు కెప్టెన్ అయ్యాడా? భారత జట్టుకు అన్ని ట్రోఫీలు అందించాడా” అంటూ నెటిజన్లు నితీష్ రెడ్డిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే ఇది ఎక్కడికో దారితీస్తోందని భావించిన నితీష్ రెడ్డి.. వెంటనే అప్రమత్తమయ్యాడు. తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నాడు. “ధోని అంటే నాకు చాలా ఇష్టం ఉంది. నేను మాట్లాడిన మాటలతో సంబంధం లేకుండా ఆ వీడియో క్లిప్ ఎడిట్ చేశారు. కొంతమంది తమకు నచ్చినట్టుగా నెగిటివ్ గా వ్యాప్తి చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి పనులు ఆటగాళ్ల మధ్య అంతరాన్ని పెంచుతాయని” నితీష్ రెడ్డి వ్యాఖ్యానించాడు. మొత్తానికి ధోనిపై తాను చేశానని చెబుతున్న వ్యాఖ్యలకు వివరణ ఇచ్చి వివాదానికి శుభం కార్డు వేశాడు.