https://oktelugu.com/

Game Changer: గేమ్ ఛేంజర్ టైటిల్ వెనుక ఇంత కథ ఉందా..? ఈ సినిమాలో హైలెట్ అయ్యేది ఏంటంటే..?

రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకొని పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు.

Written By: , Updated On : April 11, 2024 / 10:21 AM IST
Story behind Game Changer movie title

Story behind Game Changer movie title

Follow us on

Game Changer: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్న దర్శకుడు శంకర్… జెంటిల్ మెన్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శంకర్ రెండు దశాబ్దాల పాటు వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్స్ ని కొడుతూ ఇండస్ట్రీలో తనకు ఎవరు పోటీలేరు అనేంతలా మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. ఇక రోబో సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకొని 500 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టాడు. గత రెండు మూడు సినిమాలు నుంచి శంకర్ తన ఫామ్ ను అయితే అందుకోలేకపోతున్నాడు.

కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకొని పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే రామ్ చరణ్ తో చేస్తున్న ఈ సినిమాను చాలా అడ్వాన్సుడ్ టెక్నాలజీతో దీంట్లో కొన్ని గ్రాఫికల్ సీన్స్ ను కూడా తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాని ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా కూడా మలుస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎమ్మెల్యేగా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి గేమ్ చేంజర్ అనే టైటిల్ ను పెట్టడం వెనక ముఖ్య కారణం ఏంటి అంటే పొలిటికల్ గా ఎవరికి వారు గేమ్ ని స్టార్ట్ చేసి మేమే నడిపిస్తున్నాం అని అనుకుంటారు. కానీ అది స్టార్ట్ చేసింది మాత్రం రామ్ చరణ్…

వాళ్లకి తెలియకుండానే రామ్ చరణ్ వాళ్ళతో గేమ్ ఆడిస్తూ ఉంటాడట. దానివల్లే ఈ సినిమాకి గేమ్ చేంజర్ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో అటు శంకర్ ఇటు రామ్ చరణ్ ఇద్దరూ కూడా భారీ సక్సెస్ ని అందుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం సినిమాకి చాలా హైలెట్ గా నిలవబోతున్నట్టుగా తెలుస్తుంది. 3000 మందితో ఒక ఫైట్ సీక్వెన్స్ ని తీశారట. అది కూడా దాదాపు ఒక 15 నిమిషాల పాటు ఉంటుందట. అందువల్లే ఈ సినిమా మొత్తానికి ఈ ఫైట్ సీక్వెన్స్ హైలెట్ గా నిలవబోతుందని శంకర్ తమిళ్ మీడియా కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు…