Nitish Kumar Reddy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా కోల్పోయినప్పటికీ.. మెల్ బోర్న్ మైదానంలో నితీష్ కుమార్ రెడ్డి ఆడిన ఆటను ఎవరూ మర్చిపోలేరు. ఆస్ట్రేలియా జట్టు ముందు ఫాలో ఆన్ ఆడ గండాన్ని ఎదుర్కొన్న టీమిండియా కు.. ఆ కష్టాన్ని తప్పించాడు నితీష్ కుమార్ రెడ్డి. సూపర్ సెంచరీ చేసి ఆస్ట్రేలియా బౌలర్లకు సింహ స్వప్నం లాగా నిలిచాడు. దీంతో అతని పేరుని మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చారు. అత్యంత చిన్న వయసులో మెల్ బోర్న్ మధ్యాహ్నం లో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో నితీష్ కుమార్ రెడ్డి ఉండడం విశేషం.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తనను తాను నిరూపించుకున్న తర్వాత నితీష్ కుమార్ రెడ్డి పేరు మార్మోగిపోయింది. అతడికి జట్టులో స్థానం సుస్థిరమైపోయింది. ఇంగ్లాండ్ తో జట్టుతో టి20, వన్డే సిరీస్లో చోటు దక్కించుకోలేకపోయినప్పటికీ.. నితీష్ కుమార్ రెడ్డి కి టీమిండియాలో ఇప్పటికి రెడ్ కార్పెట్ పరిచే ఉంది..
తండ్రికి అదిరిపోయే బహుమతి
నితీష్ కుమార్ రెడ్డి ఈ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం అతడి తండ్రి.. నితీష్ కుమార్ రెడ్డి తండ్రి విశాఖపట్నంలో హిందుస్థాన్ జింక్ లో పనిచేసేవారు. అయితే తన కొడుకు కెరియర్ కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అతడిని క్రికెట్లో రాణింపజేసేలా చేయడానికి పలు అకాడమీ లలో చేర్పించారు. చివరికి అతని కష్టం ఊరికే పోలేదు. నితీష్ కుమార్ రెడ్డి కి ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టులో స్థానం లభించడం.. అక్కడ అతడు తన ప్రతిభను నిరూపించుకోవడం.. టీమిండియాలో చోటు లభించడం.. ఇక్కడ లభించిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవడంతో.. నితీష్ కుమార్ రెడ్డి పేరు మార్మోగిపోవడం ప్రారంభమైంది. ప్రస్తుతం అతడు యువ సంచలన ఆటగాడిగా కీర్తి గడిస్తున్నాడు. ఇటీవల తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మెట్ల మార్గంలో మోకాళ్ళ మీద నడిచి దర్శించుకున్న నితీష్ కుమార్ రెడ్డి.. తనకు ఇంతటి గొప్ప జీవితాన్ని ప్రసాదించిన తన తండ్రికి బంగారు బ్రాస్లెట్ తయారు చేయించి కానుకగా ఇచ్చాడు. ఆ చిత్రాన్ని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు..” నాకోసం నా తండ్రి కెరియర్ వదిలేసుకున్నాడు. జీవితాన్ని త్యాగం చేశాడు. అలాంటి వ్యక్తికి ఏది ఇచ్చినా తక్కువే. ఏం చేసినా తక్కువే” అని నితీష్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించాడు. భారత జట్టులో స్థానం సంపాదించుకున్న తర్వాత.. తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన తర్వాత.. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తన తండ్రికి ఈ బహుమతి ఇచ్చినట్టు నితీష్ కుమార్ రెడ్డి పేర్కొన్నాడు.