SSMB 29 : దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఇదో మైలు రాయి చిత్రం అవుతుందని అంతా నమ్మకంగా ఉన్నారు. వారి అంచనాలకు తగినట్లే రూ.1000కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రాజమౌళి చిత్రానికి సంబంధించిన షూటింగ్ లోకేషన్లను సెర్చ్ చేసి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలోనే అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ ప్రారంభం అయింది.
తాజాగా సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూట్ కూడా మొదలైంది. ప్రిన్స్ మహేష్ పై కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీన్ని ఓ చిన్న షెడ్యూల్ గా ప్లాన్ చేసి ముందుకెళ్లారు. ప్రస్తుతం అల్యుమి నియం ఫ్యాక్టరీలోనే షూటింగ్ జరుగుతోంది. అదే స్పాట్ లో వర్క్ షాప్ కూడా దర్శకుడు రాజమౌళి నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా సెలక్ట్ అయిన సంగతి తెలిసిందే. మహేష్, ప్రియాంక చోప్రాలకు సంబంధించిన కీలక సన్నివేశాలపై ప్రీ వర్క్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో ప్రియాంకను తీసుకోవడానికి కారణం ఆమెకు గ్లోబల్ లెవల్లో ఫేమ్ ఉంది. ఆమెతో కాంబినేషన్ సన్నివేశాలంటే ఎంతో జాగ్రత్తగా చిత్రీకరించాల్సి ఉంటుంది. అందుకే రాజమౌళి ఆ సన్నివేశాలకు సంబంధించి ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. ఇంకా సినిమాలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ పవర్ పుల్ రోల్ లో జాన్ అబ్రహం నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే మరో బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ మరో కీలక పాత్రలో చేస్తున్నట్లు తెలుస్తోంది.
అది కీలక పాత్రనా లేకపోతే సినిమాలో మహేష్ బాబుకి తండ్రి పాత్రనా అనేదానిపై స్పష్టత లేదు. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పటికే కొన్ని పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత ‘మహారాజ్’, ‘గరుడ’ లాంటి పేర్లు ప్రచారంలో ఉండగా తాజాగా వాటి సరసన మరో కొత్త టైటిల్ వచ్చి చేరింది.. రాజమౌళి పాన్ వరల్డ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని తీస్తోన్న సినిమా కావడంతో ‘జనరేషన్’ అనే మరో ఆసక్తికర టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
స్టోరీ కాన్సెప్ట్ ఆధారంగా జనరేషన్ పేరు సినిమాకు పక్కా యాప్ట్ అవుతుందని యూనిట్ అనుకుంటుందట. ఇప్పటికే సినిమా రెండు పార్టులుగా రిలీజ్ అవుతుందన్న ప్రచారంలో ఉంది. `జనరేషన్` తో మరో సబ్ టైటిల్ కూడా జోడించి మొదటి భాగాన్ని రిలీజ్ చేస్తారని…రెండవ పార్టుకు మరో సబ్ టైటిల్ యాడ్ అవుతుందని సమాచారం. అలాగే సినిమాలో హై ఎండ్ విజువల్ ఎఫెక్స్ట్ ఉంటాయని.. వాటి కోసం హాలీవుడ్ టెక్నికల్ టీమ్ పని చేస్తుందని ఫస్ట్ నుంచి వినిపిస్తూనే ఉంది. రాజమౌళి రేంజ్ యాక్షన్ సన్నివేశాల్ని అందుకోవాలంటే? హాలీవుడ్ టెక్నిషియన్లతో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకోసం సినిమాలో మేజర్ పార్ట్ వాళ్లదే ఉంటుందని అంటున్నారు.