Homeక్రీడలుక్రికెట్‌Hyderabad Vs Kolkata IPL 2026: బ్యాట్ తో 39.. బంతితో రెండు.. శభాష్ నితీష్...

Hyderabad Vs Kolkata IPL 2026: బ్యాట్ తో 39.. బంతితో రెండు.. శభాష్ నితీష్ కుమార్ రెడ్డి

Hyderabad Vs Kolkata IPL 2026: అవి మామూలు విమర్శలు కాదు.. మామూలు ట్రోలింగ్ కానే కాదు.. అసలు ఎందుకు తీసుకున్నారు.. ఎందుకు అతడిని కొనసాగిస్తున్నారు.. ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు.. బంతితో ఆకట్టుకోవడం లేదు.. బ్యాటుతో సత్తా చూపించడం లేదు.. మైదానంలో కూడా చురుకుగా లేడు.. ఇటువంటి వ్యక్తికి ఈ స్థాయిలో ఎలివేషన్ ఇవ్వడం అవసరమా.. తెలుగు కుర్రాడు.. ఆటలో మొనగాడు అని చెప్పడం ఇంతవరకు కరెక్ట్.. ఇదిగో ఇలానే సాగిపోతున్నాయి కొద్దిరోజులుగా హైదరాబాద్ ఆటగాడు నితీష్ […]

Hyderabad Vs Kolkata IPL 2026: అవి మామూలు విమర్శలు కాదు.. మామూలు ట్రోలింగ్ కానే కాదు.. అసలు ఎందుకు తీసుకున్నారు.. ఎందుకు అతడిని కొనసాగిస్తున్నారు.. ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు.. బంతితో ఆకట్టుకోవడం లేదు.. బ్యాటుతో సత్తా చూపించడం లేదు.. మైదానంలో కూడా చురుకుగా లేడు.. ఇటువంటి వ్యక్తికి ఈ స్థాయిలో ఎలివేషన్ ఇవ్వడం అవసరమా.. తెలుగు కుర్రాడు.. ఆటలో మొనగాడు అని చెప్పడం ఇంతవరకు కరెక్ట్.. ఇదిగో ఇలానే సాగిపోతున్నాయి కొద్దిరోజులుగా హైదరాబాద్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి మీద విమర్శలు.

తన మీద వస్తున్న విమర్శలకు.. చేస్తున్న ట్రోలింగ్ కు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన సమాధానం చెప్పాడు. ఉప్పల్ స్టేడియంలో అయితే అడ్వాంటేజ్ ఉంటుందని.. సొంత గ్రౌండ్ కాబట్టి ఆడాడు అని అనుకుంటారని.. కోల్ కతా లో దుమ్ము రేపాడు. ఐపీఎల్ లో కొంతకాలంగా కోల్ కతా ఏకపక్షంగా హైదరాబాద్ మీద ఆధిపత్యాన్ని చూపిస్తోంది. 2024లో ఫైనల్ మ్యాచ్లో గెలిచి.. హైదరాబాద్ జట్టును ఓడించింది కోల్ కతా. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ జట్టు మీద రివెంజ్ తీర్చుకునే అవకాశం హైదరాబాద్ జట్టుకు లభించలేదు. అయితే ఇన్ని రోజులకు హైదరాబాద్ జట్టు పగ తీరింది. 2024 ఐపీఎల్ ఫైనల్ నాటి ఓటమికి బదులు తీరింది.

కోల్ కతా లో జరిగిన మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. వరుసగా వికెట్లు పడుతున్న క్రమంలో క్లాసెన్ తో కలసి అద్భుతమైన భాగస్వామ్యం నిర్మించాడు. 24 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అంతేకాదు 17 పరుగులు ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. తద్వారా హైదరాబాద్ జట్టుకు తను ఎంత స్పెషలో నిరూపించుకున్నాడు. వాస్తవానికి ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు భారీగా పరుగులు చేస్తుందనుకున్నారు. ఒకానొక దశలో కీలకమైన వికెట్లు కోల్పోయి ఇబ్బందులలో పడిన హైదరాబాద్ జట్టుకు నితీష్ కుమార్ రెడ్డి ఆపద్బాంధవుడుగా నిలిచాడు. వేగంగా ఆడుతూనే.. వికెట్ కాపాడుకున్నాడు. చేసింది 39 పరుగులు మాత్రమే అయినప్పటికీ.. అవి హైదరాబాద్ జట్టు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి. జట్టుకు అవసరమైన సందర్భంలో వికెట్లు పడగొట్టాడు. తద్వారా హైదరాబాద్ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అతడు పోషించిన పాత్రను గుర్తించిన నిర్వాహకులు మెన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారంతో సత్కరించారు.

2025లో నితీష్ కుమార్ రెడ్డి ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. అంచనా వేసిన విధంగా బౌలింగ్ చేయలేకపోయాడు. దీంతో అతని మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఆయనప్పటికీ మేనేజ్మెంట్ నమ్మకం ఉంచి 2026 సీజన్ లో కూడా అతడిని కంటిన్యూ చేసింది. మేనేజ్మెంట్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. తొలి మ్యాచ్లో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. రెండవ మ్యాచ్లో మాత్రం దుమ్ము రేపాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper