Homeఎంటర్టైన్మెంట్Rakasa Movie Review 2026: రాకాస మూవీ అక్కడే దెబ్బకొట్టింది...ఆ రెండు సీన్స్ ఉంటే బాగుండేది...

Rakasa Movie Review 2026: రాకాస మూవీ అక్కడే దెబ్బకొట్టింది…ఆ రెండు సీన్స్ ఉంటే బాగుండేది…

Rakasa Movie Review 2026: సంగీత్ శోభన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాకాస’ సినిమా ఈరోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ని నిన్న నైట్ నుంచే వేశారు. ఈ సినిమా ఒక అనిపించినప్పటికి కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఏమాత్రం ఎంగేజ్ చేయలేకపోయాయి. రాక్షసుడికి సంబంధించిన బ్యాక్ స్టోరీ ని బాగా ఎలివేట్ చేశారు. కానీ క్లైమాక్స్లో మాత్రం దానికి సంబంధించిన క్లారిటీని సరిగ్గా […]

Rakasa Movie Review 2026: సంగీత్ శోభన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాకాస’ సినిమా ఈరోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ని నిన్న నైట్ నుంచే వేశారు. ఈ సినిమా ఒక అనిపించినప్పటికి కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఏమాత్రం ఎంగేజ్ చేయలేకపోయాయి. రాక్షసుడికి సంబంధించిన బ్యాక్ స్టోరీ ని బాగా ఎలివేట్ చేశారు. కానీ క్లైమాక్స్లో మాత్రం దానికి సంబంధించిన క్లారిటీని సరిగ్గా ఇవ్వలేకపోయారు.

Also Read: బైకర్.. రేసింగ్ లు నచ్చేవారికి ఓకే

ఇక ఆ రాక్షసుడు ఎలా చనిపోతాడు అనే దాని గురించి ఒక కాన్సెప్ట్ అయితే డిజైన్ చేశారు. కానీ అలా చేయకముందే వాడు చనిపోయి వెళ్ళిపోవడం అనేది లాజికల్ గా అంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేదు… ఇక సెకండ్ హాఫ్ మొత్తం కోటలోకి వెళ్లిన తర్వాత ఏదో ఉంటుంది అని అనుకున్నా ప్రతి ఒక్కరికి నిరాశే ఎదురైంది.

అక్కడ ఏమి ఉండకపోగా సంగీత్ శోభన్, వెన్నెల కిషోర్, గెటప్ శీను లతో కలిసి కొంతవరకు కుళ్ళు జోకులు చేశాడు. ఇక దానికి తోడుగా బ్లాక్ దయ్యం ఎపిసోడ్ కొంతవరకు ప్రేక్షకులను మెప్పించినప్పటికి అది కూడా అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ముఖ్యంగా రాక్షసుడి ఎపిసోడ్ లాజికల్ గా సెట్ చేసి ఉంటే బాగుండేది. అలాగే కోటలోకి వెళ్లిన తర్వాత ఇంకా హర్రర్ సన్నివేశాలు ఎఫెక్టివ్ గా ఉండాల్సింది.

అది హర్రర్ సినిమా అని స్టార్ట్ చేసి అసలు హార్రర్ ఎలిమెంట్స్ లేకుండా సినిమాను ముగించడం అనేది ఈ సినిమాకి భారీ మైనస్ గా మారింది…సంగీత్ శోభన్ యాక్టింగ్ బాగున్నప్పటికి అతని క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం బాలేదు. వీటన్నింటి కారణంగానే రాకాస సినిమా యావరేజ్ మూవీ గా అనిపిస్తుంది…చూడాలి మరి ఈ సినిమా ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ను రాబడుతోంది అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper