Odi World Cup 2023: న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ : ఒక్క ఓటమితో సెమీస్ రేసులోకి నాలుగు టీంలు…ఏం జరుగనుంది…

న్యూజిలాండ్ సెమీఫైనల్ రేస్ లో మరింత ముందుకు వస్తుంది. ఇక పాకిస్తాన్ కనుక మ్యాచ్ గెలిచినట్లయితే ఈ సెమీఫైనల్ మీద సస్పెన్స్ అనేది మరింత కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇలాంటి క్రమంలో ఏ టీమ్ ఎప్పుడు ఎవరి మీద పై చేయి సాధిస్తుందో తెలియలేని పరిస్థితిలో ఉంది.

Written By: Gopi, Updated On : November 4, 2023 10:24 am

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: వరల్డ్ కప్ లో లీగ్ దశ ముగియడానికి రెడీగా ఉంది అయినప్పటికీ సెమి ఫైనల్ కి వెళ్లే టీములు ఏవి అనే దానిమీద ఇంకా స్పష్టత రాలేదు. ప్రతి టీం కూడా మూడు, నాలుగు మ్యాచ్ ల్లో విజయాలను సాధించి సెమీస్ రేస్ లో కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఇండియన్ టీం ఒకటే అఫీషియల్ గా సెమీస్ కి క్వాలిఫై అయింది.ఇక రీసెంట్ గా నెదర్లాండ్ పైన ఆఫ్గనిస్తాన్ విజయం సాధించడంతో సెమీఫైనల్ రేస్ మరోసారి ఆసక్తికరంగా మారింది.ఇక ఇప్పటికే ఇండియా టీమ్ అఫిషియల్ గా సెమీస్ కి చేరుకోగా ఇండియా తో పాటు సౌతాఫ్రికా కూడా ఆల్మోస్ట్ సెమీఫైనల్ కి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. ఇక ఇదే క్రమంలో ఇవాళ్ల జరిగే మ్యాచ్ మొత్తం సెమీఫైనల్ రేస్ ని డిసైడ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ్ల న్యూజిలాండ్, పాకిస్తాన్ టీం ల మధ్య జరగబోతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ కనుక విజయం సాధిస్తే పాకిస్తాన్, ఇంగ్లాండ్, నెదర్లాండ్, శ్రీలంక లాంటి నాలుగు జట్లు కూడా ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.

ఇక న్యూజిలాండ్ సెమీఫైనల్ రేస్ లో మరింత ముందుకు వస్తుంది. ఇక పాకిస్తాన్ కనుక మ్యాచ్ గెలిచినట్లయితే ఈ సెమీఫైనల్ మీద సస్పెన్స్ అనేది మరింత కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇలాంటి క్రమంలో ఏ టీమ్ ఎప్పుడు ఎవరి మీద పై చేయి సాధిస్తుందో తెలియలేని పరిస్థితిలో ఉంది.ఇక సెమీస్ కి వెళ్లాల్సిన నాలుగు జట్లు ఏవో తెలియాలంటే మొత్తం లీగ్ మ్యాచ్ లు ముగిసే దాకా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.ఇక ఇలాంటి క్రమంలో ఇండియన్ టీమ్ మీద సెమీఫైనల్ లో తలపడే టీమ్ ఏది అనే ప్రశ్న అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ఇండియన్ అభిమానులందరూ ఇండియాతో సెమీఫైనల్ లో తలపడే టీం ఏది అనే దాని మీద చాలా మంది ఎదురుచూస్తున్నారు…ఇక ఇలాంటి సమయంలో సెమీఫైనల్ రేస్ అనేది చాలా రసవత్తరంగా మారింది…

ఇక రేపు ఇండియా, సౌత్ ఆఫ్రికా టీముల మధ్య ఒక భారీ మ్యాచ్ అనేది జరగబోతుంది ఇప్పటివరకు ఏడు మ్యాచ్ ల్లో విజయం సాధించిన ఇండియన్ టీం ను ఓడిస్తే వరుసగా 8 మ్యాచ్ ల్లో విజయం సాధించిన టీం గా చరిత్రలో నిలిచిపోతుంది.ఇక సౌతాఫ్రికా టీం కూడా 7 మ్యాచ్ ల్లో ఆడితే అందులో నెదర్లాండ్ పైన ఓడిపోయిన ఒక్క మ్యాచ్ మినహా ఇస్తే మిగిలిన 6 మ్యాచ్ ల్లో కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక రేపు కనక సౌతాఫ్రికా విజయాన్ని సాధిస్తే సౌతాఫ్రికా కూడా అఫీషియల్ గా సెమీఫైనల్ కి క్వాలిఫై అవుతుంది.ఇక ఇలాంటి నేపథ్యంలో ఏ టీమ్ లు సెమీఫైనల్ చేరుకుంటాయనేది తెలియాల్సి ఉంది…