https://oktelugu.com/

World Cup T20 Final: న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా.. నువ్వా నేనా..? ఫైనల్ లో గెలుపెవరిది?

World Cup T20 Final Australia vs New Zealand : ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ స్టేజికి వచ్చింది. సూపర్, సెమీ ఫైనల్ మ్యాచులు దాటుకుంటూ వచ్చిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ లో పోటీ పడబోతున్నాయి. ఈరోజు జరిగే మ్యాచులో ఎవరు టైటిల్ గెలుచుకుంటారో తేలనుంది. అయితే ఈ రెండు జట్లు ఇప్పటి వరకు టీ 20 కప్ గెల్చుకోలేదు. దీంతో ఎవరు టైటిల్ గెల్చుకున్నా మొదటి విన్నర్ అవుతారు. దీంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2021 / 10:15 AM IST
    Follow us on

    World Cup T20 Final Australia vs New Zealand : ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ స్టేజికి వచ్చింది. సూపర్, సెమీ ఫైనల్ మ్యాచులు దాటుకుంటూ వచ్చిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ లో పోటీ పడబోతున్నాయి. ఈరోజు జరిగే మ్యాచులో ఎవరు టైటిల్ గెలుచుకుంటారో తేలనుంది. అయితే ఈ రెండు జట్లు ఇప్పటి వరకు టీ 20 కప్ గెల్చుకోలేదు. దీంతో ఎవరు టైటిల్ గెల్చుకున్నా మొదటి విన్నర్ అవుతారు. దీంతో ఇరు దేశాల అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 2010లో ఫైనల్ వరకు చేరి రన్నరఫ్ గా నిలవగా.. న్యూజిలాండ్ తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది.

    t20-world-cup-2021

    ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు టీ 20 మ్యాచుల్లో 14 సార్లు పోటీ పడ్డాయి. వీటిలో న్యూజిలాండ్ 4 సార్లు విజయం సాధించింది. మిగతా మ్యాచులు ఆస్ట్రేలియా గెలుచుకుంది. 2005 ఫిబ్రవరి 17న తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా గెలుపొందింది. ప్రపంచ కప్ మ్యాచుల్లో మాత్రం న్యూజిలాండ్ దే పై చేయి ఉంది. 2016లో భారత్ లో జరిగిన టీ20 మ్యాచుల్లో న్యూజిలాండ్ 8 వికెట్లు కోల్పోయి 3 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయింది. 2015లో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడి ఆస్ట్రేలియా కప్ గెలుచుకుంది.

    ఐసీసీ టోర్ని విషయానికొస్తే న్యూజిలాంగ్ గ్రాఫ్ పెరిగింది. 2015లో ఫైనల్ వరకు వెళ్లినా.. 2019లోనూ కప్ చేరజార్చుకుంది. 2019లో న్యూజిలాండ్ కు కప్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఈ టోర్నీలో జరిగిన ఫైనల్ మ్యాచులో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు సమానంగా 241 పరుగులు చేశాయి. సూపర్ ఓవర్ కూడా సమానంగా 15 పరుగులు చేశాయి. దీంతో బౌండరీల ఆధారంగా లెక్కింపు నిర్వహించగా ఇంగ్లాండ్ దే పైచేయిగా నిలించింది. దీంతో కప్ కోల్పోవాల్సి వచ్చింది. అయితే టెస్ట్ ఛాంపియన్ షిప్ లో మాత్రం కివిస్ సత్తా చాటుతోంది. ఈ సంవత్సరం జూన్ లో జరిగిన ఫైనల్ మ్యాచులో భారత్ పై కివీస్ గెలుపొందింది.

    ఐసీసీ 2021 వరల్డ్ కప్ మ్యాచుల్లో న్యూజిలాండ్ మొదటి నుంచి జాగ్రత్తగా ఆడుతూ వస్తోంది. పాకిస్తాన్ తో ఓటమి చెందిన తరువాత ఆటగాళ్లు తమ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా జట్టులోని బౌలర్లు చెలరేగుతున్నారు. ఇప్పటి వరకు ఆడిన జట్టుల్లో కివీస్ బౌలర్లు ముందంజలో ఉన్నారు. వీరిలో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టును గెలిపిస్తున్నారు. కెప్టెన్ కేన్ విలియమ్స్ కూడా ఎక్కువ బౌలర్లను నమ్ముకొనే బరిలోకి దిగుతున్నారు. అయితే బ్యాటింగ్ విషయంలోనూ పక్కా ప్రణాళికా వేస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాట్స్ మెన్లను దించడంతో సభ్యులు సైతం వ్యక్తిగతంగా తమ ప్రతిభను కనబరుస్తున్నారు.

    ఆస్ట్రేలియా విషయానికొస్తే బ్యాటింగ్ భారం టాప్ ఆర్డర్ పై ఎక్కువగా పడుతోంది. టాప్ ప్లైయర్లలో ఒకరైనా డేవిడ్ వార్నర్ పైనే ఎక్కువ ఆశలు ఉన్నాయి. సెమిస్ లో ఇతడు 49 పరుగులు చేయగా.. వెస్టీండీస్ మ్యాచులో 89 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇప్పటి వరకు 47.20 సగటుతో మొత్తం 236 పరుగులు చేశాడు. వార్నర్ తో పాటు కెప్టెన్ ఆరోన్ ఫించ్, మిచెల్ మార్క్లపై కూడా భారం పడే అవకాశాలున్నాయి. ఇక మిడిలార్డర్ లో మ్యాక్స్ వెల్, స్టీవ్ స్మిత్ లు జట్టులో ఉన్నా ఆటతీరు అంతంతమాత్రంగానే ఉంది. అయితే మార్కస్ స్ట్రాయిలిన్ మాత్రం సెమిఫైనల్లో జట్టు విజయంలో కీలకంగా మారాడు. బౌలింగ్ విభాగంలో ఆడమ్ జంపా ఈ టోర్నీలో అత్యధికంగా 12 వికెట్లు తీసి ముందంజలో ఉన్నారు.