Actress Bhumika: ఒకప్పటి అగ్ర కథానాయికగా ఆమె కనబడగానే అప్పటి కుర్రాళ్లకు ఫుల్ కిక్ ఎక్కిపోయేది. పైగా ఆమె అందాల నిధి. ఇప్పటికీ తన వయసు పై బడిన ఆమె అందంలోని పట్టు ఇంకా తగ్గలేదు. ఆమె బిగువుల్లోని ఆకర్షణ ఇంకా పోలేదు. అందుకే ఆమె అంటే.. ఇప్పటికీ క్రేజ్ ఉంది. ఆమె.. భూమిక. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తు వచ్చేది ఆమె నడుము.
ఆ నడుము తాలూకు సీన్ వైరల్ అవుతూనే ఉంది. మరి అలాంటి భూమిక ప్రస్తుతం అవకాశాల కోసం అందర్నీ రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితిలో ఎందుకు ఉంది ? తన సెకండ్ ఇన్నింగ్స్ లో భూమికకు వచ్చిన స్టార్ డమ్ మాట దేవుడెరుగు ? కనీస అవకాశాలు కూడా సాధించలేక సతమతమవుతూ ఉంది. భూమిక ఫ్యామిలీ ఆర్థికంగా నష్టపోయింది. అప్పటి నుంచే భూమిక మళ్ళీ మొహానికి రంగు వేసుకుంటుంది.
అయితే, సెకెండ్ ఇన్నింగ్స్ లో మాత్రం భూమిక(Actress Bhumika) ఎక్కువగా బిజీ కాలేకపోయింది. కొన్ని సినిమాల్లో వదిన, అక్క, తల్లి లాంటి పాత్రలు వచ్చినా .. ఎందుకో అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నిజానికి భూమికకు తెలుగులో పెద్ద చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే నాని హీరోగా వచ్చిన “ఎంసీఏ” తప్ప మిగతా సినిమాలు ఏవీ ఆమెకు ఛాన్స్ లను తెచ్చి ఇవ్వలేకపోయాయి.
అలాగే ఈ ఏడాది “పాగల్”, “సీటిమార్” చిత్రాల్లో కనిపించినా అవి ప్లాప్ అయ్యాయి. దాంతో, భూమిక పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. అసలుకే ఈ ముదురు భామ కెరీర్ పల్లె వెలుగు బస్సులా సాగుతోంది అంటే.. ఈ ప్లాప్స్ దెబ్బకు బస్సే లేకుండా పోయేలా ఉంది. ఆఫర్లు రాకపోవడానికి ఇక్కడ మరో కారణం కూడా ఉంది. భూమిక ఎక్కువగా పార్టీలకు వెళ్ళాలి.
ఎందుకంటే పార్టీలకు వెళ్తేనే కనీసం కొన్ని సినిమాల నుంచి ఛాన్స్ లు వస్తాయి. పైగా ఫిలింమేకర్స్ తో రోజూ టచ్ లో ఉండాలి. మెయిన్ గా మోడ్రెన్ మదర్ గా ఉండాలి. అప్పుడే అవకాశాలు వస్తాయి , మరి భూమిక అలా మారుతుందా ?
Also Read: బాలయ్య అభిమానులకు అదిరిపోయే అప్డేట్… “అఖండ” ట్రైలర్ ఎప్పుడంటే ?
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు “క్యాలీ ఫ్లవర్” నుంచి స్వీట్ గిఫ్ట్ ఇచ్చిన చిత్ర బృందం