pakistan vs new zealand డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో.. సొంత దేశంలో పాకిస్తాన్ ఆడుతున్న నేపథ్యంలో.. ఆ జట్టుపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. కానీ మాకు అంత సీన్ లేదని.. ఛాంపియన్స్ ట్రోఫీలో గతంలో మాదిరిగా ఆడే సత్తా లేదని పాకిస్తాన్ జట్టు నిరూపించింది. పాకిస్తాన్ వేదికగా ట్రై సిరీస్ జరిగింది. ఈ సిరీస్ లో పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తలపడ్డాయి. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్, పాకిస్తాన్ తలపడ్డాయి. కరాచీ వేదికగా శుక్రవారం రాత్రి పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముందుగా పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది. 49.3 ఓవర్లలో 242 పరుగులు మాత్రమే చేయగలిగింది.. మహమ్మద్ రిజ్వాన్ (46) పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. విల్ ఓరూర్కే 4/43, మిచెల్ సాంట్నర్ 2/20, మైకేల్ బ్రేస్ వెల్ 2/38 తో అదరగొట్టారు. అనంతరం పాకిస్తాన్ విధించిన 243 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 45.2 ఓవర్లలో చేదించింది. డారిల్ మిచెల్ 57, టామ్ లాతం 56 పరుగులతో ఆకట్టుకున్నారు.. నసీంషా రెండు వికెట్లు సాధించాడు.
ఆ నిర్ణయమే కొంపముంచింది
ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జడ్పీ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచాడు. కరాచీ మైదానం బౌలింగ్ కు సహకరిస్తుంది. కానీ ఏ మాత్రం అంచనా వేయకుండా రిజ్వాన్ బ్యాటింగ్ వైపు మొగ్గు చూపించాడు. కానీ న్యూజిలాండ్ బౌలర్లు పాకిస్తాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఓ రూర్కే (4/43) నాలుగు వికెట్లు పడగొట్టాడు.. అతడి బౌలింగ్లో ఆడేందుకు పాకిస్తాన్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సాంట్నర్ (2/38) రెండు వికెట్లు సాధించాడు. మైకేల్ బ్రేస్ వెల్ (2/38) రెండు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా పాకిస్తాన్ ఆటగాళ్లు భారీ స్కోర్ చేయలేకపోయారు. 242 పరుగుల వరకే ఆగిపోయారు. వాస్తవానికి ఇదే మైదానంపై జరిగిన ఓ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విధించిన 350 పరుగుల టార్గెట్ ను పాకిస్తాన్ జట్టు చేదించింది. అయితే న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ కు వచ్చేసరికి పాకిస్తాన్ చేతులెత్తేసింది.. కరాచీ మైదానంలో భిన్నమైన ట్రాక్ ఉంటుంది. స్పిన్, పేస్ బౌలర్లకు పేస్ – ఆఫ్ ఇస్తుంది. కానీ ఈ విషయాన్ని రిజ్వాన్ విస్మరించాడు. బౌలింగ్ ఎంచుకోవాల్సింది పోయి.. బ్యాటింగ్ వైపు మొగ్గు చూపించాడు. అయితే అతడి నిర్ణయం చాలా తప్పని న్యూజిలాండ్ బౌలర్లు నిరూపించారు. ముఖ్యంగా ఓరూర్కే అదిరిపోయే బంతులు వేస్తూ.. పాకిస్తాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ట్రై సిరీస్లో సూపర్ ఫామ్ లో ఉన్న ఫకార్ జమాన్ ను అద్భుతమైన బంతివేసి అవుట్ చేసిన ఓరూర్కే.. ఆ తర్వాత అతడు అదే జోరు కొనసాగించాడు.. అయితే బాబర్ అజామ్ న్యూజిలాండ్ బౌలర్లపై కాస్త ఎదురు దాడికి దిగినప్పటికీ.. అతడు అదే జోరును చివరి వరకు కొనసాగించలేకపోయాడు. దీంతో పాకిస్తాన్ భారీ స్కోర్ చేయలేకపోయింది. త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ ట్రై సిరీస్లో ఓటమి పాలు కావడం.. ఆ జట్టు అభిమానులను తీవ్రంగా కుంగదీస్తోంది.
Fielding me to hum Lumber 1 h naaa…#PAKvsNZ@ABCricinfo16 pic.twitter.com/BchSZpwMG8
— Anukul01 (@lucifer01872) February 14, 2025