IND Vs NZ Test Match : పూణేలోనూ బెంగళూరు ఫలితమే.. భారత్ ను స్పిన్ తోనే దెబ్బ కొట్టిన న్యూజిలాండ్..

బెంగళూరు లో జరిగిన తొలి టెస్ట్ లో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ పడిపోయింది. పేస్ బౌలింగ్ తో భారత జట్టుకు న్యూజిలాండ్ చుక్కలు చూపించింది. దీంతో రెండవ టెస్టు జరిగిన పూణే మైదానాన్ని స్పిన్ వికెట్ గా రూపొందించారు. అయితే ఇక్కడ కూడా సేమ్ ఫలితమే వచ్చింది.

Written By: Neelambaram, Updated On : October 26, 2024 4:55 pm

IND Vs NZ Test Match

Follow us on

IND Vs NZ Test Match : కొన్ని సంవత్సరాలుగా స్వదేశంపై టెస్ట్ క్రికెట్లో టీమిండియా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. అయితే రోహిత్ సేనకు న్యూజిలాండ్ జట్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. పూనే వేదికగా జరిగిన రెండవ టెస్టులోనూ న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా రెండు టెస్టుల సీరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో దక్కించుకుంది. న్యూజిలాండ్ విధించిన 359 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో రంగంలోకి దిగిన భారత జట్టు 245 రన్స్ కే కుప్ప కూలింది. భారత జట్టులో యశస్వి జైస్వాల్ 77 పరుగులతో రాణించాడు. మిగతా వారంతా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు పడగొట్టిన సాంట్నర్.. రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో సత్తా చాటాడు. మొత్తంగా ఒక టెస్టులో 13 వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత గడ్డపై న్యూజిలాండ్ జట్టు టెస్ట్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. ఇక ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కొనసాగుతున్న నేపథ్యంలో విదేశీ గడ్డపై న్యూజిలాండ్ జట్టు టెస్టు సిరీస్ సాధించడం ఇదే ప్రథమం. 2012 నుంచి టీమిండియా స్వదేశంలో వరుసగా టెస్ట్ సిరీస్ లు గెలుచుకుంటూ వస్తోంది. మేటి జట్లను కూడా మట్టికరిపించుకుంటూ విజయయాత్ర కొనసాగిస్తోంది. అలాంటి చోట న్యూజిలాండ్ జట్టు చేతిలో తలవంచింది. ఇక ఈ సిరీస్లో చివరిదైనా మూడవ టెస్ట్ నవంబర్ 1 నుంచి ముంబై వేదికగా మొదలవుతుంది.

359 పరుగుల లక్ష్యం..

198/5 పరుగులతో శనివారం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. 255 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో 103 పరుగుల లభించింది.. రెండవ ఇన్నింగ్స్ 255 పరుగులు కలుపుకొని.. మొత్తంగా భారత్ ఎదుట 359 రన్ టార్గెట్ విధించింది. అయితే భారీ పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా.. 34 పరుల వద్ద కెప్టెన్ రోహిత్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత గిల్ (23), యశస్వి జైస్వాల్ నిలకడగా ఆడారు. దీంతో టీమిండియా విజయంపై ఆశలు పెట్టుకుంది. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 81/1 వద్ద నిలిచింది. అయితే రెండవ సెషన్లో న్యూజిలాండ్ బౌలర్ సాంట్నర్ రెచ్చిపోయాడు. అతడు జైస్వాల్, గిల్, కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాలను అవుట్ చేసి భారత జట్టు విజయాకాశాలను తీవ్రంగా దెబ్బతీశాడు. వాస్తవానికి రిషబ్ పంత్ లేని పరుగు కోసం వెళ్లి రన్ అవుటయ్యాడు. ఇక చివర్లో రవీంద్ర జడేజా (42) మెరుపులు మెరిపించినప్పటికీ.. ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు. వాస్తవానికి భారత్ లోకి అడుగుపెట్టేముందు న్యూజిలాండ్ జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. శ్రీలంకపై కూడా 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. అంతకుముందు భారత్ బంగ్లాదేశ్ తో 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ గెలిచింది. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ను 4-1 తేడాతో దక్కించుకుంది. పైగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో తిరుగులేని స్థాయిలో ఉంది. అయినప్పటికీ అనామకమైన న్యూజిలాండ్ జట్టు చేతిలో 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయింది.. ఈ ఏడాది జనవరి నెలలో ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ జరిగినప్పుడు.. మొదటి మ్యాచ్ ను భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత వరుసగా నాలుగు టెస్టులు గెలిచింది. న్యూజిలాండ్ జట్టు చేతిలో బెంగళూరులో ఓడిపోయినప్పుడు.. ఆ తర్వాత జరిగే పూణే టెస్టులో భారత్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆటగాళ్లు ఏమాత్రం సత్తా చూపించలేకపోవడంతో బెంగళూరు ఫలితమే పూణేలోనూ పునరావృతమైంది.