Puri Jagannath : కానీ వీరందరి కామన్ పాయింట్ ఒక్కటే.. పూరీ జగన్నాథ్ లా సీన్లు రాయలేకపోతున్నామని ఫీలింగ్. ఎన్నో సార్లు ఈ విషయాన్ని వీవీ వినాయక్ తన ఇంటర్వ్యూ్ల్లో చెప్పుకొచ్చాడు. ఇక రాజమౌళి అయితే ఏకంగా తనకు ఒక్క రోజు అసిస్టెంట్ డైరెక్ట్ గా అవకాశం ఇవ్వమని బిజినెస్ మెన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పూరీని రెక్వెస్ట్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
మొన్నటి దాకా పూరీ జగన్నాథ్ మమ్మల్ని పెట్టి ఎప్పుడు సినిమా తీస్తాడా అని ఎదురు చూశారు స్టార్ హీరోలు. కానీ వరుస ప్లాఫులు పూరీ జగన్నాథ్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడు ఏ హీరో తనకు అవకాశం ఇస్తాడా అని పూరీ ఎదురు చూస్తున్నాడని ఇండస్ర్టీ టాక్.
ప్రతి సినిమాతో డామినేషన్
పూరీ జగన్నాథ్, ఎస్ఎస్ రాజమౌళి ఒకే సమయలో ఇండస్ట్రీకి వచ్చినా తొలి నాళ్లలో పెద్ద హిట్లు కొట్టింది మాత్రం పూరీ జగన్నాథే. రాజమౌళి ఒక్క హిట్టు తీస్తే పూరీ అంతకు మించిన హిట్టు కొట్టి రాజమౌళికి సవాల్ విసిరాడు. ఇక 2006లో పోకిరీ సినిమా రికార్డులను బ్రేక్ చేయడానికి ఎస్ఎస్ రాజమౌళికి మూడేళ్లు పట్టింది. ఇక పూరీ తక్కువ సమయంలోనే సినిమా కంప్లీట్ చేస్తుంటాడు. ముందుగానే బడ్జెట్ లెక్కలు వేసుకుంటాడు. కానీ ఎస్ఎస్ రాజమౌళి మాత్రం ఒక్కో సినిమాను ఏండ్ల పాటు తీస్తూనే ఉంటాడు. ఇదే విషయమై రాజమౌళి ఓ సినిమా ఫంక్షన్ లో పూరీని అడిగాడు. ఇంత త్వరగా స్ర్కిప్టు ఎలా రాస్తున్నావ్.. షూటింగ్ ఎలా కంప్లీట్ చేస్తున్నావని.. ఆ ట్రిక్ ఏంటో మాలాంటి వాళ్లకు చెప్పాలని కోరాడు. ఒక్క రోజు తనకు అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశం ఇవ్వాలని అడిగాడు. ఇక రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ కూడా తనకు పూరీ అంటే అసూయ అని ఓ షో లో చెప్పుకొచ్చాడు. ఆ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నది. తన మొబైల్ స్క్రీన్ సేవర్ గా పూరీ ఫొటో పెట్టుకోవడం విశేషం. తనలోని రైటర్ అంటే తనకో ఎంతో ఇష్టమని, పూరీ సినిమాలు చూస్తుంటే తనలో ఉత్సాహం వస్తుందని చెప్పుకొచ్చాడు. ఇలా దేశంలోనే టాప్ రైటర్ గా పేరొందిన విజయేంద్ర ప్రసాద్, పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ రాజమౌళి పూరీ అంటే తమకు ప్రొఫెషనల్ గా అసూయ అని.. పూరీ తీసిన సినిమాకంటే బెటర్ గా సినిమాలు చేయాలని భావిస్తుంటాని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అజయ్ యాదవ్