New Zealand: న్యూజిలాండ్ జట్టు ఇప్పుడే కాదు… కొన్ని దశాబ్దాల నుంచి అద్భుతమైన అద్భుతమైన జట్టుగా పేరుపొందింది. ఫ్లెమింగ్, రాస్ టేలర్, షేన్ బాండ్ వంటి ఆటగాళ్లతో దుర్భేద్యమైన టీం గా వినతికి ఎక్కింది. ఐసీసీ నిర్వహించిన నాకౌట్ ట్రోఫీ ని 2000 సంవత్సరంలో గెలుచుకుంది. అప్పుడు టీమిండియాను ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడించింది. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఓటమి దశ నుంచి గెలుపు వరకు చేరుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2021 లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ లో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లోనూ భారత జట్టును ఓడించింది. న్యూజిలాండ్ ఐసీసీ ట్రోఫీలు సాధించిన రెండుసార్లు టీమిండియాను ఓడించడం విశేషం. అయితే ప్రస్తుతం జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో మాత్రం న్యూజిలాండ్ ఆ మ్యాజిక్ ప్రదర్శించలేకపోయింది. ఫైనల్ మ్యాచ్లో భారీ స్కోర్ చేయలేక చేతులు ఎత్తేసింది. అందువల్లే టీమిండియా ఎదుట తల వంచింది. అయితే న్యూజిలాండ్ ఇప్పుడే కాదు.. ఐసీసీ నిర్వహించిన మెగాటోర్నీలలో విఫలమైంది.
Also Read:అప్పుడు విరాట్ కోహ్లీ.. ఇప్పుడు రోహిత్ శర్మ.. మధ్యలో 76.. ఏంటా కథ..
ఎన్ని మ్యాచ్ లలో ఓడిపోయిందంటే..
న్యూజిలాండ్ జట్టు ఐసిసి నిర్వహించిన అనేక మెగా టోర్నీలలో ఓటమిపాలైంది. 2011లో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోయింది.. 2015లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిపాలైంది. 2016లో టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో పరాజయం పాలైంది. 2019లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. 2021లో టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ప్రత్యర్థి జట్టు ముందు తలవంచింది.. 2022లో జరిగిన టి20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో ఓటమిపాలైంది. 2023 వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్ లోనూ న్యూజిలాండ్ ఓడిపోయింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఇలా దాదాపు 8 సార్లు న్యూజిలాండ్ జట్టు ఐసిసి టోర్నీలలో ఓడిపోవడం విశేషం. 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్లింది. అప్పుడు తప్ప ఐసీసీ నిర్వహించిన మెగా టోర్నీలలో న్యూజిలాండ్ గొప్ప ప్రదర్శన చూపించింది. అయితే కప్ దక్కించుకునే సమయంలోనే న్యూజిలాండ్ ఒత్తిడికి గురవుతోంది. అనవసరమైన తప్పిదం చేసి ఓటమిపాలవుతోంది. క్రికెట్లో దక్షిణాఫ్రికా తర్వాత అత్యంత దురదృష్టకరమైన జట్టుగా విమర్శలు ఎదుర్కొంటున్నది. న్యూజిలాండ్ అన్ని రంగాలలో బలమైన జట్టు అయినప్పటికీ.. కీలక దశలో మాత్రం జట్టు ఆటగాళ్లు విఫలం కావడంతో ఓటములు ఎదుర్కొంటున్నది. ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లోనూ న్యూజిలాండ్ జట్టు టాస్ నెగ్గినప్పుడు తీసుకున్న తప్పుడు నిర్ణయం.. ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణమైంది.