https://oktelugu.com/

New Zealand Vs Uganda: పసికూనపై న్యూజిలాండ్ ప్రతాపం.. 5.2 ఓవర్లలో ఘన విజయం

ముందుగా బ్యాటింగ్ చేసిన ఉగాండా జట్టు 18.4 ఓవర్లలో కేవలం 40 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఆ జట్టులో కెన్నెత్ వైస్వా11 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 15, 2024 / 02:07 PM IST

    New Zealand Vs Uganda

    Follow us on

    New Zealand Vs Uganda: టి20 వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా న్యూజిలాండ్ బరిలోకి దిగింది.. ఆ జట్టు ఆటగాళ్లు సూపర్ ఫామ్ లో ఉండడంతో కచ్చితంగా గట్టి ప్రదర్శన ఇస్తుందని అందరూ భావించారు.. కానీ ఆ జట్టు నాసిరకమైన ఆటతీరుతో పరువు పోగొట్టుకుంది.. గ్రూప్ దశలోనే ఇంటి బాట పట్టింది. ఈ నేపథ్యంలో తన చివరి లీగ్ మ్యాచ్లో ఎట్టకేలకు న్యూజిలాండ్ బోణి కొట్టింది. ట్రినిడాడ్ వేదికగా శనివారం ఉగాండా జట్టుతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో దిగ్విజయం సాధించింది.. న్యూజిలాండ్ ఇప్పటికే టోర్నీ నుంచి బయటికి వెళ్లిపోయింది.. ప్రాధాన్యం లేని మ్యాచ్ అయినప్పటికీ.. న్యూజిలాండ్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. అటు బంతి, ఇటు బ్యాట్ తో ఆకట్టుకుని, గెలుపును సొంతం చేసుకుంది.

    ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఉగాండా జట్టు 18.4 ఓవర్లలో కేవలం 40 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఆ జట్టులో కెన్నెత్ వైస్వా11 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.. ఇక మిగతా వారంతా సింగిల్ డిజిట్ ల కే పరిమితమైపోయారు. న్యూజిలాండ్ బౌలర్ సౌథి 3/4, బౌల్ట్ 2/7, శాంట్నర్ 2/8, రచిన్ రవీంద్ర 2/9 అదరగొట్టారు.. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగిన ఉగాండా ఈ దశలోనూ న్యూజిలాండ్ బౌలర్లను కాచుకోలేకపోయింది.. ఉగాండా జట్టును తొలి ఓవర్ లోనే బౌల్ట్ దెబ్బ కొట్టాడు.. ఓపెనర్ సైమన్, వన్ డౌన్ లో వచ్చిన రాబిన్సన్ ను గోల్డెన్ డక్ గా వెనక్కి పంపించాడు.. ఈ క్రమంలో ఉగాండా 15 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.. 26 పరుగులకే 7 వికెట్లను చేజార్చుకుంది. దీంతో టి20 లలో నమోదైన 39 పరుగుల స్వల్ప స్కోర్ రికార్డు బద్దలవుతుందనిపించింది. ఈ దశలో అచెలం 9, కెన్నెత్ ఉగాండా జట్టు స్కోరును 40 పర్రులకు చేర్చారు. అనంతరం ఈ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఒక వికెట్ మాత్రమే 5.2 చేదించింది..

    ఈ స్వల్పస్కోరు ను చేదించేందుకు న్యూజిలాండ్ బరిలోకి దిగింది. చేదన ను ముందుగా నిదానంగా ప్రారంభించింది. ఓపెనర్ ఫిన్ అలెన్ 17 బంతుల్లో 9 పరులు మాత్రమే చేశాడు.. రియాజెత్ బౌలింగ్లో వికెట్ కీపర్ అచెలమ్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో ఓపెనర్ కాన్వే 15 బందులో 22 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడి పవర్ ప్లే లోనే న్యూజిలాండ్ జట్టును గెలిపించాడు. లీగ్ దశలో న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది. వరుస ఓటములతో లీగ్ దశ నుంచే ఇంటికి వెళ్లిపోయింది.. పపువా న్యూ గినియా జట్టుతో న్యూజిలాండ్ చివరి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచినప్పటికీ న్యూజిలాండ్ ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉంటాయి. అయితే ఈ గ్రూపులో ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ చెరో ఆరు పాయింట్లు సాధించి, సూపర్ -8 కు వెళ్లిపోయాయి.