Netherlands Vs Scotland: వన్డే ప్రపంచకప్ 2023కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ దుమ్మురేపింది. ప్రపంచకప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్‌లో సంచలన విజయాలతో వెస్టిండీస్, జింబాబ్వే జట్టను మట్టికరిపించిన స్కాట్‌లాండ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన నెదర్లాండ్స్ ఆటగాళ్లు 4 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.
నమస్తే ఇండియా పోస్టర్‌తో ఫోజు..
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సూపర్ విక్టరీతో సంతోషంలో మునిగిపోయిన నెదర్లాండ్స్ ఆటకాల్లు మ్యాచ్ ముగిసిన తర్వాత ‘నమస్తే ఇండియా’పోస్టర్‌తో ఫోజు ఇచ్చింది. ఐదో సారి ప్రపంచకప్ బరిలోకి దిగే అవకాశాన్ని అందుకుంది.
లీడ్ ఆల్‌రౌండ్ షో..
ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఆటగాడు బాస్ డెలీడ్ సూపర్ ఇన్నింగ్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇటు బ్యాట్‌తోపాటు, అటు బంతితోనూ దుమ్మురేపి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. బ్యాటింగ్‌లో 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌తో 123 పరుగులు చేశాడు. అంతకు ముంద బౌలింగ్‌లో 52 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ సాగిందిలా..
ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్‌లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 277 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్‌ములెన్(110 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106) సెంచరీతో సత్తాచాటాడు. కెప్టెన్ బెరింగ్టన్(64) కూడా రాణించాడు. బాస్ డె లీడ్ ఆ జట్టును కట్టడి చేశాడు. అనంతరం 278 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 42.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచకప్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. బాస్ డె లీడ్ సెంచరీతో స్కాట్‌లాండ్ విజయాన్ని అడ్డుకున్నాడు.
44 ఓవర్లలోనే గెలవాలి..
278 పరుగుల లక్ష్యాన్ని 44 ఓవర్లలో ఛేదిస్తేనే నెదర్లాండ్స్ ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో బాయటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్ 31 ఓవర్లకు 164/5తో ఆ జట్టు కష్టాల్లో పడింది. అప్పటికీ లీడ్ 52 బంతుల్లో 47 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. నెదర్లాండ్స్ గెలుపు కష్టమే అని అంతా భావించారు. కానీ ఆ తర్వాతే దూకుడు పెంచిన లీడ్ ఎడాపెడా బౌండరీలు బాదాడు. సిక్సర్లతో చెలరేగాడు. సకీబ్ (33 నాటౌట్)తో కలిసి అతను ఆరో వికెట్‌కు 11.3 ఓవర్లలోనే 113 పరుగులు జోడించాడు. దీంతో 42.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్న నెదర్లాండ్స్ ప్రపంచకప్ బెర్తు కొట్టేసింది.