Adipurush Closing Collections: ‘ఆదిపురుష్’ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్..వచ్చిన నష్టాలు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

ఎందుకంటే ఈ చిత్రానికి మొదటి మూడు రోజుల ఓపెనింగ్స్ తప్ప, నాల్గవ రోజు నుండి మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పుడు క్లోసింగ్ స్థాయికి వచ్చేసింది.

Written By: Vicky, Updated On : July 7, 2023 3:04 pm

Adipurush Closing Collections

Follow us on

Adipurush Closing Collections: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అంతే కాదు హిందూ సంఘాల నుండి తీవ్రమైన వ్యతిరేకతని కూడా ఎదురుకుంది ఈ చిత్రం. వాల్మీకి రాసిన రామాయణం ఇది కాదని, రామాయణం ని వెక్కిరిస్తున్నట్టుగా తీసిన ఈ చిత్రాన్ని తక్షణమే బ్యాన్ చెయ్యాలంటూ హై కోర్టు లో కేసులు కూడా వేశారు. కానీ వాళ్ళు బ్యాన్ చెయ్యాల్సిన అవసరం కూడా రాలేదు .

ఎందుకంటే ఈ చిత్రానికి మొదటి మూడు రోజుల ఓపెనింగ్స్ తప్ప, నాల్గవ రోజు నుండి మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పుడు క్లోసింగ్ స్థాయికి వచ్చేసింది. అటు హిందీ లో కానీ ఇటు తెలుగులో కానీ కలెక్షన్స్ రావడం పూర్తి గా ఆగిపోయాయి. దీనితో ఈ చిత్రానికి ప్రాంతాల వారీ గా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాము.

టాలీవుడ్ కి అత్యంత రెవిన్యూ ఇచ్చే ప్రాంతం నైజాం లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 50 కోట్ల రూపాయలకు జరిగింది. క్లోసింగ్ లో కేవలం 36 కోట్ల రూపాయిల షేర్ మాత్రమే రాబట్టింది. అంటే 14 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది అన్నమాట. అలాగే సీడెడ్ లో 10 కోట్ల రూపాయిలు, ఉత్తరాంధ్ర లో 10.64 కోట్ల రూపాయిలు, తూర్పు గోదావరి జిల్లాలో 6.22 కోట్ల రూపాయిలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4.51 కోట్ల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 2.40 కోట్ల రూపాయిలు, గుంటూరు జిల్లాలో 6.80 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 82 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా, హిందీ లో 70 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.

ఆ తర్వాత కర్ణాటక లో 12.45 కోట్లు, ఓవర్సీస్ లో 24 కోట్ల రూపాయిలు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 193 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్ రైట్స్ 242 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే బయ్యర్స్ కి దాదాపుగా 50 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది అన్నమాట.