https://oktelugu.com/

India Vs Nepal: భారత్ తో మ్యాచ్ : నేపాల్‌ క్రికెటర్లకు కాసుల పంట!

ఫోర్‌ బాదితే మాత్రం రూ.25 వేలు నజరానా అందిస్తామని పేర్కొంది. మ్యాచ్‌ అన్నాక వికెట్‌ పడడం.. ఫోర్, సిక్సర్‌లు పోవడం సాధారణమే. మొత్తానికి నేపాల్‌ ఆటగాళ్లపై కాసుల వర్షం కురవనుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 5, 2023 / 02:41 PM IST

    India Vs Nepal

    Follow us on

    India Vs Nepal: ఆసియా కప్‌ 2023లో భాగంగా భారత్, నేపాల్‌ జట్ల మధ్య మ్యాచ్‌ సోమవారం జరిగింది. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో ఫలితం ప్రకటించారు. టీమిండియా నేపాల్‌పై ఘన విజయం సాధించి సూపర్‌ – 4 దశకు చేరుకుంది. భారత్‌తో మ్యాచ్‌లో తమ ఆటగాళ్లను ఎంకరేజ్‌ చేసేందుకు నేపాల్‌కు చెందిన అర్ణ బీర్‌ కంపెనీ ఓ బంపరాఫర్‌ ప్రకటించింది.

    బీర్ల కంపెనీ ఆఫర్‌ ఇదీ..
    భారత్‌తో మ్యాచ్‌లో నేపాల్‌ బౌలర్లు తీసే ప్రతీ వికెట్‌కూ రూ.లక్ష నజరానాను అర్ణ బీర్‌ కంపెనీ ప్రకటించింది. కేవలం బౌలర్లకే కాదు.. బ్యాటర్లకూ ఆఫర్‌ ఇచ్చింది. భారత బౌలర్ల బౌలింగ్‌లో బాదే ఒక్కో సిక్సర్‌కు రూ.లక్ష బహుమతి ఇస్తానని తెలిపింది. ఫోర్‌ బాదితే మాత్రం రూ.25 వేలు నజరానా అందిస్తామని పేర్కొంది. మ్యాచ్‌ అన్నాక వికెట్‌ పడడం.. ఫోర్, సిక్సర్‌లు పోవడం సాధారణమే. మొత్తానికి నేపాల్‌ ఆటగాళ్లపై కాసుల వర్షం కురవనుంది.

    దంచి కొట్టారు.. లక్షలు గెలుచుకున్నారు..
    బీర్ల కంపెనీ ఆఫర్‌తో నేపాల్‌ ఆటగాళ్లు జాక్‌పాట్‌ కొట్టారు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని కాసులు పంట పండించుకున్నారు. ఆ జట్టు ఓపెనర్‌ కుశాల్‌ భుర్టెల్‌ రూ.2.75 లక్షలు గెలుచుకోగా.. మరో ఓపెనర్‌ ఆసిఫ్‌ షేక్‌ రూ. 2 లక్షలు, సోంపాల్‌ కమీ రూ.2.25 లక్షలు, గుల్సన్‌ ఝా, దీపేంద్ర సింగ్‌ ఐరీ రూ.75 వేల చొప్పున సొంతం చేసుకున్నారు. కొందరు లక్షలు గెలుచుకోగా.. మరికొందరు వేలతో సరిపెట్టుకున్నారు.

    ఎవరెవరుఎంత గెలుచుకున్నారంటే..?

    కుశాల్‌ భుర్టెల్‌ (3 ఫోర్లు, 2 సిక్సులు) – రూ.2.75 లక్షలు
    ఆసిఫ్‌ షేక్‌ (8 ఫోర్లు) – రూ.2 లక్షలు
    సోంపాల్‌ కమీ (ఒక ఫోర్, 2 సిక్సులు) – రూ.2.25 లక్షలు
    గుల్సన్‌ ఝా (3 ఫోర్లు) – రూ.75 వేలు
    దీపేంద్ర సింగ్‌ ఐరీ (3 ఫోర్లు) – రూ.75 వేలు గెలుచుకున్నారు.

    బౌలర్లకు నిరాశే..
    అయితే బీర్ల కంపెనీ ప్రకటించిన ఆఫర్‌ను బౌలర్లు వినియోగించుకోలేకపోయారు. భారత ఓపెనర్లు రోహిత్‌శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ నేపాల్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వికెట్‌ నష్టపోకుండా 147 పరుగులు చేశారు. ఈ క్రమంలో వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ నిలిపివేశారు. వర్షం తగ్గకపోవడంతో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో ఫలితం ప్రకటించారు. దీంతో వికెట్‌ తీసి రూ.లక్ష గెలుచుకోవాలనుకున్న నేపాల్‌ బౌలర్లకు నిరాశే మిలిగింది. వరణుడు ఆఫర్‌పై నీళ్లు చల్లాడు. ఈ మ్యాచ్‌ లో మొదట బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ 230 పరుగులు చేయగా.. భారత 20.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 147 పరుగులు చేసింది.