మహేష్ బాబు బర్త్ డే సందడి మొదలైందిగా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ఆగస్టు 9. ఆ తేదీ రేపే. అప్పుడే ట్విట్టర్ లో ఆయన పుట్టినరోజు వేడుకలు మొదలైపోయాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, దర్శకులు, నటులు అందరూ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా స్పెషల్ ఫొటోలు తయారు చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ హోరెత్తిస్తున్నారు. ‘సర్కారి వారి పాటకు’ సంగీతం అందిస్తున్న థమన్.. ఒక అద్భుత చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకొని బర్త్ డే స్పెషల్ అంటూ షేర్ […]

Written By: NARESH, Updated On : August 8, 2021 8:51 pm
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ఆగస్టు 9. ఆ తేదీ రేపే. అప్పుడే ట్విట్టర్ లో ఆయన పుట్టినరోజు వేడుకలు మొదలైపోయాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, దర్శకులు, నటులు అందరూ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా స్పెషల్ ఫొటోలు తయారు చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ హోరెత్తిస్తున్నారు.

‘సర్కారి వారి పాటకు’ సంగీతం అందిస్తున్న థమన్.. ఒక అద్భుత చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకొని బర్త్ డే స్పెషల్ అంటూ షేర్ చేయగా.. దాన్ని చాలా మంది అభిమానులు ప్రముఖులు షేర్లు చేస్తూ సందడి చేస్తున్నారు.

ఇక మహేష్ బాబు కూడా తన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు తన కొత్త లుక్ ను చూపించారు. తాజాగా అవిగోవారికర్ అనే ప్రముఖ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. దాన్ని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు.

ఇక రేపు మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సర్కారి వారి పాట టీం కూడా రెడీ అయ్యింది. దర్శకుడు పరుశురాం ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశాడు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ పండుగ మొదలైంది. ఇప్పటికే అన్ని రికార్డులు బద్దలు కొట్టేలా ట్విట్టర్ లో ట్రెండింగ్ చేయడానికి మహేష్ ఫ్యాన్స్ రెడీ అయిపోయారు.

https://twitter.com/urstrulyMahesh/status/1424340206862278657?s=20

https://twitter.com/MusicThaman/status/1424045366182170627?s=20