Namibia Vs South Africa T20: క్రికెట్ లో కొన్ని జట్ల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. మన అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజ్ లో ఉంటాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియా జట్టును తీసుకుంటే.. ఆ జట్టు నాసిరకమైన ఆట తీరు ప్రదర్శిస్తుందని ఎవరూ ఊహించలేరు. టీమ్ ఇండియాను తీసుకుంటే దారుణంగా ఆడుతుందని ఎవరూ అంచనా వేయలేరు. టీమిండియా, ఆస్ట్రేలియా మాత్రమే కాదు.. క్రికెట్లో దక్షిణాఫ్రికా కూడా అత్యంత బలమైన జట్టు. ఈ జట్టు నుంచి చెత్త ప్రదర్శనను ఏ అభిమాని కూడా ఊహించడు. కానీ అలాంటి ప్రదర్శనను దక్షిణాఫ్రికా జట్టు చేసి చూపించింది.
ఈ ఏడాది ఆఫ్ఘనిస్తాన్ చేతిలో టి20 సిరీస్ కోల్పోయింది దక్షిణాఫ్రికా. వాస్తవానికి దక్షిణాఫ్రికా అలా ఆడుతుందని.. అంత చెత్తగా బ్యాటింగ్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా వెళ్ళిపోయిన ఆ జట్టు.. టీమిండియా కు ముచ్చెమటలు పట్టించిన ఆ జట్టు ఇలా ఆడుతుందని.. సిరీస్ కోల్పోతుందని ఎవరూ అనుకోలేదు. చివరిదాకా పోరాడిన ఆ జట్టు అద్వితీయమైన ఆట తీరు కొనసాగించింది. అయితే అలాంటి జట్టు నమీబియా మీద ఓడిపోవడం.. అది కూడా దారుణంగా ఓడిపోవడాన్ని సగటు దక్షిణాఫ్రికా అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు.
దక్షిణాఫ్రికా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. గిబ్స్ తరం నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు ఎంతోమంది ఆటగాళ్లు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు గమనాన్ని సరికొత్తగా చూపించారు. అయితే అలాంటి జట్టు నమీబియా మీద అత్యంత అవమానకరంగా ఓడిపోవడాన్ని ఏ అభిమాని కూడా తట్టుకోలేకపోతున్నాడు. శనివారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో నమీబియా చివరి బంతికి ఫోర్ కొట్టి జయకేతనం ఎగరవేసింది. దక్షిణాఫ్రికా జట్టు ఈ మ్యాచ్లో 134 పరుగులు చేసింది. పరుగులు చేదించడంలో నమిబియా చివరి వరకు పోరాడింది. చివరి బంతికి ఫోర్ కొట్టి గెలిచేసింది. పొట్టి ఫార్మాట్లో నమిబియా జట్టుకు ఇది రెండవ విజయం. 2022లో జింబాబ్వే నమిబియా జట్టు విజయం సాధించింది. మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా దక్షిణాఫ్రికా జట్టులోకి డికాక్ పునరాగమనం చేశాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. నమిబియా జట్టు లో చాలామంది ప్లేయర్లు పెద్దగా అనుభవం లేనివారే. అయినప్పటికీ పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టుకు చుక్కలు చూపించారు. ఓటమిని పరిచయం చేశారు. అంతేకాదు దక్షిణాఫ్రికా జట్టును చోకర్స్ అని ఎందుకంటారో నిరూపించారు..
దక్షిణాఫ్రికా జట్టు ఇటీవల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియాతో తలపడింది. ఆస్ట్రేలియా జట్టుతో నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడింది. చివరికి విజయం సాధించి తొలిసారి ఐసీసీ ట్రోఫీని అందుకుంది. టి20 వరల్డ్ కప్ లో ఓడిపోయిన దక్షిణాఫ్రికా జట్టు.. ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఆ లోటును భర్తీ చేసింది. అటువంటి ఆ జట్టు నమీబియా మీద ఓడిపోయి అపప్రదను మూటగట్టుకుంది.