https://oktelugu.com/

Mushir Khan : లాగి పెట్టి కొడితే.. బంతి స్టేడియం పైకప్పు తగిలి వెనక్కి వచ్చింది.. వీడియో వైరల్

ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దేశ వాళి క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో సంచలనాలు నమోదు అవుతున్నాయి. ఈ ట్రోఫీలో భాగంగా యువ ఆటగాడు ముషీర్ ఖాన్ అనిత రసాధ్యమైన ఆట తీరు ప్రదర్శించాడు. బెంగళూరు మైదానంలో విధ్వంసాన్ని సృష్టించాడు. 373 బంతుల్లో 181 రన్స్ చేశాడు. అతడు ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 6, 2024 / 07:20 PM IST

    Mushir Khan

    Follow us on

    Mushir Khan : దులీప్ ట్రోఫీలో ప్రారంభ మ్యాచ్ లోనే ముషీర్ ఖాన్ సత్తా చాటాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై తన ప్రతాపం చూపించాడు. ఇండియా – బీ జట్టులో ఆడుతున్న అతడు ఇండియా – ఏ జట్టుపై శివతాండవం చేశాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో దుమ్మురేపాడు. ఇండియా – ఏ బౌలర్ల దూకుడుకు ఇండియా – బీ జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. 94 పరుగులు మాత్రమే చేసి ఏడు కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జట్టు 120 పరుగుల లోపే అలౌట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ దశలో ముషీర్ ఖాన్, నవదీప్ షైనీ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఏకంగా ఎనిమిదవ వికెట్ కు 205 పరుగులు జత చేశారు. ఫలితంగా ఇండియా – బీ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 321 రన్స్ చేసింది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఈ స్థాయిలో పరుగులు చేయడం ముమ్మాటికి ముషీర్ ఖాన్ చలవే. తొలి రోజు శతకం బాదిన ముషీర్ ఖాన్.. రెండవ రోజు కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. బౌలర్ ఎవరనేది లక్షపెట్టలేదు. బాదుడే మంత్రంగా ముందుకు సాగాడు. చెత్త బంతులను బౌండరీలకు పంపించిన అతడు.. మిగతా బంతులను అద్భుతమైన డిఫెన్స్ ఆడాడు..

    డబుల్ సెంచరీకి చేరువగా వచ్చి..

    డబుల్ సెంచరీకి దగ్గర్లోకి వచ్చిన అతడు సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టాడు. టి20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. 19 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ కోల్పోయినప్పటికీ.. అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కులదీప్ యాదవ్ బౌలింగ్లో భారీ షాట్ పుట్టబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. అంతకుముందు అతడు కొట్టిన సిక్స్ చిన్న స్వామి స్టేడియాన్ని షేక్ చేసింది. అతడు కొట్టిన సిక్స్ ఏకంగా స్టేడియం పైకప్పును తగిలింది. అంతే వేగంతో దూసుకు వచ్చింది. భారీ సిక్సర్ కొట్టిన అతడు.. అదే ఉత్సాహంతో మరో సిక్స్ కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే ఆ బంతిని రియాన్ పరాగ్ అందుకున్నాడు. 181 పరుగుల వద్ద ముషీర్ ఖాన్ ప్రస్థానం ముగిసింది. ముషీర్ ఖాన్ కొట్టిన భారీ సిక్సర్ సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ సిక్సర్ ను చూసి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం లభిస్తే సరిగా వినియోగించుకోలేకపోయాడు. ముషీర్ ఖాన్ మాత్రం భారత క్రికెట్ లో సంచలనాలు నమోదు చేసేలా ఉన్నాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

    నిదానంగా ఆడుతున్నారు

    ఇక ఇండియా – ఏ జట్టు ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఆ జట్టు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 36, గిల్ 25 పరుగులు చేశారు. వీరిద్దరూ బలమైన భాగస్వామ్యాన్ని నిలకలపడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో మరో వికెట్ పడకుండా రియాన్ పరాగ్ 27*, కేఎల్ రాహుల్ 23* జాగ్రత్తగా ఆడుతున్నారు. అయితే ఓపెనర్ బ్యాటర్లు నవదీప్ షైనీ బౌలింగ్లో ఔటయ్యారు.