Allu Arjun : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు ఇండియాలోనే నెంబర్ వన్ హీరోలుగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే అందులో భాగంగానే వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా ఒక సినిమా ప్రాజెక్టు సెట్స్ మీద వుండగానే మరికొన్ని ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒక్కొక్కరి చేతిలో దాదాపు మూడు సినిమాల వరకు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ మాత్రం సుకుమార్ డైరెక్షన్ చేసిన ‘పుష్ప ‘ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ఇక ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఎలాగైనా సరే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అల్లు అర్జున్ తన తర్వాత సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే విషయం మీద ఇప్పటివరకైతే సరైన క్లారిటీ లేదు. ఇక ఆయన లైనప్ లో సందీప్ రెడ్డి వంగ ఉన్నప్పటికీ ప్రస్తుతం సందీప్ రెడ్డివంగా ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. కాబట్టి అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి.
గతంలో అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు వచ్చినప్పటికీ అట్లీ మాత్రం ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని బాలీవుడ్ కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్ తో సినిమాను సెట్ చేసుకున్నాడు. ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ విషయం మీద కూడా ఆయన ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు. మరి ఇప్పుడు ఈయన మౌనం వెనుక గల కారణం ఏంటి?
ఎవరితో ఆయన తన తదుపరి సినిమాను చేయబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం మన స్టార్ హీరోలందరూ వరుసగా మూడు, నాలుగు ప్రాజెక్టు లను సెట్ చేసి పెట్టుకుంటే అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2 సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినప్పటికి మరొక సినిమా మీద ఫోకస్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటో ఎవరికి తెలియని లేదు. చూడాలి మరి తన తదుపరి సినిమాను ఏ దర్శకుడి తో చేస్తాడు అనేది…