Nitish Kumar Reddy : వారెవ్వా.. ఏమన్నా వేస్తున్నాడా బౌలింగ్.. తెలుగోడి ప్రతిభను కొనియాడిన అశ్విన్ .. వైరల్ వీడియో

ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతూ సంచలనాలు సృష్టించిన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి.. టీమిండియా ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మనసు దోచుకున్నాడు. తనదైన శైలిలో బౌలింగ్ వేస్తూ రవిచంద్రన్ అశ్విన్ ను ఫిదా చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను రవిచంద్రన్ అశ్విన్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు..

Written By: Anabothula Bhaskar, Updated On : September 6, 2024 6:40 pm

Nitish Kumar Reddy

Follow us on

Nitish Kumar Reddy : దులీప్ ట్రోఫీలో భాగంగా నితీష్ కుమార్ రెడ్డి ఇండియా – బీ జట్టుకు ఆడుతున్నాడు. బెంగళూరు లో ఇండియా – ఏ జట్టుతో జరిగిన మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ వేశాడు. అద్భుతమైన లెంగ్త్ తో అతడు బంతులు సంధించాడు. 5 ఓవర్లు వేసి తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు.. ముఖ్యంగా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. పదునైన బంతులు వేస్తూ అతడికి ఒక్క పరుగు కూడా చేసే అవకాశం ఇవ్వలేదు. ఒకానొక దశలో బంతిని టచ్ చేస్తేనే చాలు రా బాబూ అనే పరిస్థితిని కేఎల్ రాహుల్ కు నికిష్ కుమార్ రెడ్డి కల్పించాడు.. నితీష్ కుమార్ రెడ్డి వేస్తున్న బౌలింగ్ చూసి రవిచంద్రన్ అశ్విన్ మంత్రముగ్ధుడయ్యాడు..” టెస్ట్ క్రికెట్ కు పూర్తిస్థాయిలో సరిపడే బౌలింగ్ వేశాడు. అసలు సిసలైన ఆల్ రౌండర్ అంటూ” కొనియాడాడు.. దీనికి సంబంధించిన వీడియోను రవిచంద్రన్ అశ్విన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ” నితీష్ కుమార్ రెడ్డి టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కు అతికే విధంగా బౌలింగ్ వేస్తున్నాడు. సిసలైన ఆల్ రౌండర్ గా దర్శనమిస్తున్నాడు” అని రాసుకొచ్చాడు. ఇదే సమయంలో సూపర్ అనే ఎమోజిని దానికి క్యాప్షన్ గా జత చేశాడు. నితీష్ కుమార్ రెడ్డిని షార్ట్ కట్ లో ఎన్ కే ఆర్ అని సంబోధించాడు. రవిచంద్రన్ అశ్విన్ పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో చర్చకు దారితీస్తోంది..

ఇటీవల ఐపీఎల్ లో నితీష్ కుమార్ రెడ్డి హైదరాబాద్ తరఫున ఆడాడు. అనితర సాధ్యమైన ఆట తీరును ప్రదర్శించాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో సంచలన ఆట తీరును ప్రదర్శించాడు. అతడు ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వడంతో టీమిండియా నుంచి కూడా పిలుపు లభించింది. కానీ ఆ సమయంలోనే అందరికీ గాయం కావడంతో చివరి నిమిషంలో జింబాబ్వే పర్యటన నుంచి వైదొలగాల్సి వచ్చింది. మరోవైపు టెస్ట్ ఫార్మాట్లో ఆల్ రౌండర్ కోటాలో స్థానం కోసం నితీష్ కుమార్ రెడ్డి ఎదురు చూస్తున్నాడు. అందువల్లే ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. బ్యాటింగ్లో డక్ ఔట్ అయిన నితీష్ కుమార్ రెడ్డి.. బౌలింగ్లో మాత్రం ఆకట్టుకుంటున్నాడు.. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ జట్టుతో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం లభిస్తుందని తెలుస్తోంది..

ఇక ఈ మ్యాచ్లో ఇండియా బీ చెట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ముషీర్ ఖాన్ 181 రన్స్ చేయడంతో.. భారత్ 321 రన్స్ చేసింది. ఒకానొక దశలో 947 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ముషీర్ ఖాన్, నవదీప్ షైనీ ఆదుకున్నారు. వీరిద్దరూ ఏకంగా ఎనిమిదో వికెట్ కు 205 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా – ఏ జట్టు స్థిరంగా ఆడుతోంది. మయాంక్ అగర్వాల్ 36, గిల్ 25 రన్స్ మాత్రమే చేసినప్పటికీ.. రియాన్ పరాగ్ 23, కేఎల్ రాహుల్ 18 పరుగులు చేసి.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.