https://oktelugu.com/

IPL 2025 : నిన్న రోహిత్ శర్మ.. నేడు 15.25 కోట్ల ఆటగాడు. ముంబై జట్టు ఎందుకిలా ఆటగాళ్లను వదిలేసుకుంటోంది?

ఐపీఎల్ 2025 సీజన్ ను ఘనంగా నిర్వహించడానికి బీసీసీఐ ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఈ టోర్నీ నిర్వహణకు చాలా సమయం ఉన్నప్పటికీ.. బీసీసీఐ ముందు జాగ్రత్తగా అనేక చర్యలను చేపడుతోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 30, 2024 5:59 pm

    Ishan Kishan

    Follow us on

    IPL 2025 : 2025 సీజన్ కు సంబంధించి మెగా వేలం నిర్వహించడానికి బీసీసీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ వేలాని కంటే ముందు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాలను జట్లు సమర్పించాల్సి ఉంటుంది. అక్టోబర్ 31 లోపు దీనికి గడువు ఉంది. ఆలోగా తమకు జాబితాలను అందించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ జాబితాను గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఐపిఎల్ అధికారిక ప్రయోజక కర్తలు స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా ప్రకటిస్తాయి. ఈసారి వేలంలోకి స్టార్ ఆటగాళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఫ్రాంచైజీలు ఆటగాళ్లతో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది..” ముఖ్యమైన ఆటగాళ్ళు ఈసారి వేలంలోకి వస్తారు. వారితో ఆయా జట్ల యాజమాన్యాలు చర్చలు జరిపాయి. యువ ఆటగాళ్లు కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఈసారి వేలం మరింత రసవత్తరంగా జరుగుతుంది. పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్ధమాన ఆటగాళ్లకు రెడ్ కార్పెట్ పరిచే అవకాశం లేక పోలేదు. ఆటగాళ్లతో కొన్ని జట్లు మంతనాలు జరుపుతున్నాయి. వేలంలోకి పంపిస్తున్నామని దిగులు చెందవద్దని.. ఆర్టీఎం ద్వారా మళ్ళీ కొనుగోలు చేస్తామని నమ్మకాన్ని జట్లు కల్పిస్తున్నాయని” స్పోర్ట్స్ వర్గాలు అంటున్నాయి.

    నేరుగా రిటైన్..

    ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఒకటి. ఈ జట్టు ఆరుగురు ఆటగాళ్లను నేరుగా రిటైన్ చేసుకునేందుకు అడుగులు వేస్తోంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, తిలక్ వర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యా, నెహల్ వదేరా, సూర్య కుమార్ యాదవ్ రిటైన్ ఆటగాళ్ల జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. ముంబై జట్టును రోహిత్ వదిలి వెళ్ళిపోతాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే అతడికి ముంబై యాజమాన్యం నత్త చెప్పిందని ప్రచారం జరుగుతుంది.. రోహిత్, బు మ్రాను 18 కోట్లకు, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ ను 14 కోట్లకు ముంబై యాజమాన్యం రిటైన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తిలక్ వర్మ కు 11 కోట్లు, అనామక ఆటగాడు నేహల్ వదేరా ను 4 కోట్లకు అంటి పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక మిగతా ఆటగాళ్లలో కీలకమైన ఇషాన్ కిషన్ ను వేలంలోకి పంపించేందుకు ముంబై జట్టు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2022 వేలంలో ఇషాన్ ను 15.25 కోట్లకు ముంబై జట్టు కొనుగోలు చేసింది. జట్టులో అతడిని ప్రధాన వికెట్ కీపర్ గా కొనసాగించింది. రిటెన్షన్ నిబంధనలను బీసీసీఐ తెరపైకి తెచ్చిన నేపథ్యంలో ఇషాన్ కిషన్ ను వేలంలో వదిలేస్తోంది. ఇక మిగతా ఆటగాళ్ల పరిస్థితి కూడా ఇలానే ఉందని స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.