Ravi Teja: మెగాస్టార్ చిరంజీవి ని లెక్కచేయని రవితేజ..మండిపడుతున్న అభిమానులు..అసలు ఏమైందంటే!

కెరీర్ ప్రారంభంలో చిరంజీవి పట్ల ఎంత గౌరవ మర్యాదలతో ఉండేవాడో, స్టార్ హీరో అయ్యాక కూడా అదే గౌరవ మర్యాదలతో ఉండేవాడు రవితేజ. అలాంటి వ్యక్తి ఈరోజు మెగాస్టార్ చిరంజీవితో తలపడబోతున్నాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Written By: Vicky, Updated On : October 30, 2024 6:00 pm

Ravi Teja(3)

Follow us on

Ravi Teja: మెగాస్టార్ చిరంజీవి కి సినీ ఇండస్ట్రీ లో ఉండే వీరాభిమానులలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకడు. హిందీ లో అమితాబ్ బచ్చన్, తెలుగు లో చిరంజీవి ని ఆదర్శంగా తీసుకొనే, ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాను అంటూ ఆయన ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. చిరంజీవి తో ఆయన కలిసి ‘అన్నయ్య’, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ‘అన్నయ్య’ సినిమా సమయంలో రవితేజ అప్పుడే ఇండస్ట్రీ లో ఎదుగుతున్న హీరోలలో ఒకరు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సమయానికి ఆయన స్టార్ హీరోగా ఎదిగాడు. కెరీర్ ప్రారంభంలో చిరంజీవి పట్ల ఎంత గౌరవ మర్యాదలతో ఉండేవాడో, స్టార్ హీరో అయ్యాక కూడా అదే గౌరవ మర్యాదలతో ఉండేవాడు రవితేజ. అలాంటి వ్యక్తి ఈరోజు మెగాస్టార్ చిరంజీవితో తలపడబోతున్నాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, రవితేజ ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో భాను భోగవరాజు అనే నూతన దర్శకుడితో సినిమా చేస్తున్నాడు.

ఈ చిత్రానికి ‘మాస్ జాతర(మనదే ఇదంతా)’ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ కాసేపటి క్రితమే మూవీ టీం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ పోస్టర్ లో రవితేజ క్రాక్ సినిమాలో ఎలాంటి లుక్ తో ఉండేవాడో, అలాంటి లుక్ తో కనిపించాడు. ఆయన అభిమానులు ఈ లుక్ పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేసారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మే9న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు. ఇక్కడే చిరంజీవి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజున చిరంజీవి ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’ విడుదల కాబోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కావాల్సిన ఈ సినిమాని రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం వాయిదా వేశారు. మే9 వ తారీఖున విడుదల చేయాలనీ మూవీ టీం మొత్తం ఒక ఏకాభిప్రాయానికి వచ్చారట.

త్వరలో అధికారిక ప్రకటన చేయబోతున్నారని సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తున్న ఈ నేపథ్యంలో అదే తేదీన రవితేజ కొత్త సినిమాని లాక్ చేయడం చిరంజీవి అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. అసలే రవితేజ వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నాడు, ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి తో క్లాష్ పడడం అవసరమా..?, వచ్చే కలెక్షన్స్ కూడా రావు అంటూ సోషల్ మీడియా లో కొంతమంది మెగా అభిమానులు పోస్టులు వేస్తున్నారు. ‘ధమాకా’ తర్వాత రవితేజ నటించిన ‘ఖిలాడీ’, ‘టైగర్ నాగేశ్వర రావు’,’ రామారావు ఆన్ డ్యూటీ’, ‘ఈగల్’,’రావణాసుర’, ‘మిస్టర్ బచ్చన్’ వంటి చిత్రాలు చేసాడు. వీటిలో ఈగల్, ఖిలాడీ చిత్రాలు తప్ప మిగిలినవన్నీ కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఈ ఫ్లాప్స్ కారణంగా రవితేజ మార్కెట్ పాతాళంలోకి పడిపోయింది, ఇలాంటి సమయంలో చిరంజీవి తో పోటీ అనవసరం అని విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.