NTR and Hrithik Roshan : తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. నిజానికి వాళ్లు చేసిన సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అలరిస్తూ భారీ కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి. తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవెల్ కి విస్తరింప చేస్తున్నాయి…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నప్పటికి తెలుగు స్టార్ హీరోలకు మాత్రం భారీ క్రేజ్ అయితే దక్కుతుంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR ) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండియన్ సినిమా ప్రేక్షకులందరికి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసి పెడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకుడికి నచ్చడమే కాకుండా ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఆయన ఎదుగుతున్నాడు. ఇప్పుడు ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ (War 2 ) అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ (Preashanth Neel) దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం తన అదృష్టం అంటూ బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ మాట్లాడుతూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
Also Read : జూనియర్ ఎన్టీయార్ కోసం రంగం లోకి దిగుతున్న హృతిక్ రోషన్…కారణం ఏంటంటే..?
ఇక హృతిక్ రోషన్ (Hruthik Roshan)కి జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో జనతా గ్యారేజ్ సినిమా అంటే చాలా ఇష్టం అంట…ఆ సినిమా ను చాలా సార్లు చూశానని ఎన్టీఆర్ అందులో ఒక మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ ఇచ్చాడని ఆ సినిమాని నేను చేసుంటే బాగుండేదని హృతిక్ రోషన్ పాలు సందర్భాల్లో తెలియజేశాడు.
హృతిక్ రోషన్ లాంటి గొప్ప నటుడు ఎన్టీఆర్ ని పొగడడం ఆయనతో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పడం లాంటి విషయాలను చూసిన ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని కూడా చాలా సంతోషపడుతున్నాడు. నిజానికి ఎన్టీఆర్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగిన హృతిక్ రోషన్ మన తెలుగు హీరో పట్ల మమకారాన్ని చూపిస్తూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇక వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న వార్ 2 సినిమా పలు రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్లాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే వార్ 2 సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. తొందరలోనే ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
Also Read : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసింది!