Mumbai Indians : కీలకమైన మ్యాచ్లో హార్దిక్ దళం ఓడిపోయింది. దీంతో టాప్ -2 అవకాశాన్ని కోల్పోయింది. వాస్తవానికి అయ్యర్ సేనతో పోల్చి చూస్తే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో హార్దిక్ బృందం అత్యంత బలంగా ఉంది. కానీ అయ్యర్ సేన ముందు తలవంచింది.. ముందుగా బ్యాటింగ్ చేసి భారీగా పరుగులు చేయాల్సిన చోట.. ఒక మోస్తరు టార్గెట్ విధించింది. ఆ తర్వాత బౌలింగ్లో చేతులెత్తేసింది. ఫలితంగా ఊహించని ఓటమిని ఎదుర్కొంది. దీంతో గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయింది. చేతులారా తలవంచి..టాప్ -2 అవకాశాలను కోల్పోయింది. తద్వారా కప్ సాధించే అవకాశాలను అత్యంత సంక్లిష్టం చేసుకుంది.
Also Read : ముంబైకి మేలు చేస్తున్న ఎలిమినేటెడ్ జట్లు.. ఎలాగంటే
సాధించడం కష్టమే
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై జట్టు ప్రయాణం అంత గొప్పగా సాగడం లేదు. ఇక ఈ సీజన్లో ప్లే ఆఫ్ వెళ్లిన జట్ల మీద ముంబై గెలవలేదు. గుజరాత్ టైటాన్స్ జట్టుపై రెండుసార్లు ఓడిపోయింది. బెంగళూరు, పంజాబ్ చేతిలో ఒక్కోసారి తలవంచింది.. అయితే ముంబై జట్టుకు క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్ లో ఈ జట్లు ఎదురుగా ఉన్నాయి. దీంతో ముంబై ఇండియన్స్ జట్టుకు వీటి పై గెలవడం అత్యంత కష్టతరంగా మారింది. బలమైన ఈ మూడు జట్లపై ముంబై గెలవడం.. కప్ సాధించడం అంత సులువైన విషయం కాదు.
బ్యాటింగ్లో ముంబై జట్టుకు తిరుగులేదని అందరూ అనుకున్నారు. కానీ కీలకమైన ఆటగాళ్లు.. ముఖ్యమైన మ్యాచ్లలో తేలిపోతున్నారు. ద్వారా ముంబై జట్టుకు అనుకోని ప్రతిఘటన ఎదురవుతోంది. దీనికి తోడు సూర్య కుమార్ యాదవ్ మాత్రమే బ్యాటింగ్ భారాన్న మోస్తున్నాడు. అతడు ప్రతి మ్యాచ్లో తన వంతుకు మించి సహకారాన్ని అందిస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ సేనతో జరిగిన మ్యాచ్లో.. స్కై అర్థ శతకం సాధించాడు. అతడు గనుక ఆమాత్రం పరుగులు చేయకపోతే హార్దిక్ సేన మరింత దారుణమైన ఓటమిని మూట కట్టుకునేది. అందువల్లే ఈ సీజన్లో ముంబై జట్టు ట్రోఫీ సాధించడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ” అన్ని జట్ల కంటే ముంబై చాలా బలమైనది. కాకపోతే కొన్ని సందర్భాల్లోనే ఆ బలం బయటపడుతోంది. మిగతా సందర్భాల్లో బలహీనంగా కనిపిస్తోంది. దారుణం ఏంటంటే కీలకమైన సమయంలోనే బలహీనతను బయట పెట్టుకోవడం ముంబై జట్టుకు అలవాటుగా మారింది. అందువల్లే ఈసారి ట్రోఫీ సాధించే జట్లలో ముంబైని పరిగణించే అవకాశం లేదని” క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. గత ఏడాది హార్దిక్ కు జట్టు పగ్గాలు లభించాయి. అప్పుడు ముంబై ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయింది. పైగా బలమైన జట్టుగా ఉన్నప్పటికీ గ్రూప్ దశనుంచే ఇంటికి వెళ్ళిపోయింది. ఈసారి ప్లే ఆఫ్ దాకా వెళ్ళిపోయినప్పటికీ.. తదుపరి దశలో ఎదురయ్యే జట్లు మొత్తం బలమైనవి కావడంతో.. కప్ సాధించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.