Mumbai Indians : ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న జట్లు పరోక్షంగా ముంబై ఇండియన్స్ కు మెయిల్ చేస్తున్నాయి. తద్వారా ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్స్ టేబుల్ లో టాప్ -2 లోకి వెళ్ళడానికి దోహదం చేస్తున్నాయి. ఇప్పటికే టేబుల్ టాపర్గా ఉన్న గుజరాత్ జట్టును లక్నో నేల నాకించింది. రెండవ స్థానంలో ఉన్న బెంగళూరును హైదరాబాద్ మట్టి కరిపించింది. హైదరాబాద్ జట్టుతో ఏదైనా ఓటమి తర్వాత రెండో స్థానానికి పంజాబ్ జట్టు పడిపోయింది. అయితే ఆ జట్టను ఢిల్లీ జట్టు ఓటమిని రుచి చూపించింది. ఈ సమీకరణలతో ముంబై ఒకసారిగా టాప్ – 2 లోకి వచ్చేసింది. ఇక ఇవాల్టి గుజరాత్ తో తలపడే పోరులో ఒకవేళ ముంబై ఇండియన్స్ కనక విజయం సాధిస్తే కచ్చితంగా టాప్ -2 లోకి వెళ్ళిపోతుంది. టాప్ -2 లోకి వెళ్లిపోయిన జట్టుకు ఐపీఎల్ లో అనేక సౌలభ్యాలు ఉంటాయి. ఒక మ్యాచ్ ఓడిపోయినా.. ఇంకో అవకాశం కూడా ఉంటుంది. అలాంటప్పుడు ముంబై నెత్తిమీద మిగతా జట్లు పాలు పోసినట్టే.
Also Read : నిన్న గాక మొన్న వచ్చిన శుభ్ మన్ గిల్ కెప్టెన్.. సచిన్ కొడుకు పరిస్థితి ఏంటి?
ఇప్పటికే ముంబై జట్టు ఐపీఎల్లో ఐదు సార్లు విజేతగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సీజన్లో ప్రారంభంలో ఓటములను ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా ఆడటం మొదలుపెట్టింది. వరుస విజయాలతో తిరుగులేని స్థానాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాలలో నిలిచింది. ఇక ఇటీవలి ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై వీరవిహారం చేసింది. గెలవాల్సిన సందర్భంలో కచ్చితంగా గెలిచి చూపించి తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. తద్వారా ప్లే ఆఫ్ లోకి వెళ్లిపోయింది. ఇతర సమీకరణాలను పక్కనపెట్టి.. ఇతర జట్ల విజయాలను పక్కనపెట్టి దర్జాగా నాలుగో స్థానాన్ని చేరుకుంది. ఇప్పుడు మొదటి మూడు స్థానాలలో ఉన్న జట్లు ఓటములను ఎదుర్కోవడంతో ముంబై జట్టు ఒకసారి గా తిరుగులేని స్థాయికి వచ్చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది.
ముంబై జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో బలంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో టాప్ -2 కు ముంబై జట్టు వచ్చేస్తే.. ఇక తిరుగు ఉండదు. ఎందుకంటే ఒత్తిడి సమయంలో ముంబై జట్టు అద్భుతంగా ఆడుతుంది. బౌలర్లు కూడా సూపర్బ్ గా రాణిస్తారు. బ్యాటర్లు కూడా ఒక రేంజ్ లో అదరగొడతారు. అలాంటప్పుడు కప్ సాధించడం ముంబై జట్టుకు పెద్ద ఇబ్బంది కాదు. ఈ లెక్కన చూస్తే ముంబై జట్టుకు అన్ని మంచి శకునములే అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి. మరి మిగతా జట్లు ఏం చేస్తాయో చూడాలి.. అన్నట్టు గుజరాత్ జట్టు ఈరోజు జరిగే మ్యాచ్లో కచ్చితంగా విజయం సాధించాలి. అలా అయితేనే ఆ జట్టుకు టాప్ -2 అవకాశం ఉంటుంది. లేకుంటే ఇక అంతే సంగతులు.