Mythri Movie Makers : గడిచిన కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీ లో జరుగుతున్న పరిణామాలను మనమంతా చూస్తూనే ఉన్నాం. కమీషన్ బేసిస్ మీద మాత్రమే థియేటర్స్ ని రన్ చేస్తాము, లేకుంటే జూన్ 1 నుండి థియేటర్స్ ని మూసేస్తాము అంటూ ఒక చర్చ నడిచిన సంగతి అందరికీ తెలిసిందే. సరిగ్గా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీ విడుదలకు దగ్గరగా ఉన్నప్పుడే ఈ చర్చ జరగడం ఏకంగా పవన్ కళ్యాణ్ వరకు ఈ విషయం చేరింది. ఆయన దీనిపై ఒక రేంజ్ లో ఫైర్ అవుతూ నిన్న విడుదల చేసిన ఒక సంచలన ప్రకటన మీడియా లో పెను దుమారమే రేపింది. ఇండస్ట్రీ లో ఉన్న వ్యక్తులకు కావాల్సినంత మర్యాదలు ఇస్తున్నాం, వాళ్ళు ఏది కోరితే అది చేస్తున్నాం, అందుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, ఇక నుండి సినీ సెలబ్రిటీలతో వ్యక్తిగత చర్చలు ఉండవు, నేరుగా సంబంధిత సంఘాలతోనే చర్చలు చేస్తుంది అంటూ ఆయన ఒక అల్టిమేటం జారీ చేసాడు.
Also Read : పవన్ ప్రకటన టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోందా?
దీనిపై పలువురు సినీ నిర్మాతలు కూడా స్పందించారు. ఇండస్ట్రీ తో ప్రభుత్వం ఎంతో స్నేహం గా మెలుగుతున్న ఈ సమయంలో అనవసరంగా గెలుక్కున్నారు అంటూ మండిపడ్డారు. మరికొంత మంది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ కేవలం నలుగురి చేతుల్లోనే ఉండాలని చూస్తున్నారని, మధ్యలో కొత్తవాళ్లు వస్తే తొక్కేయాలి అనే విధంగా చూస్తున్నారని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మొత్తం అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, ఏషియన్ సునీల్, ఇలా వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ ఒక పక్క నిర్మాణ రంగంలో, మరోపక్క డిస్ట్రిబ్యూషన్ రంగం లో దూసుకొని వెళ్తుండడాన్ని ఈ నలుగురు జీర్ణించుకోలేకపోతున్నారని, ‘హరి హర వీరమల్లు’ నైజాం థియేట్రికల్ బిజినెస్ దిల్ రాజు కి ఇవ్వకుండా, మైత్రీ మూవీ మేకర్స్ కి ఇవ్వడం వల్లే కావాలని టార్గెట్ చేస్తున్నారని, ఇలా సోషల్ మీడియా లో ఎన్నో కథనాలు వినిపిస్తున్నాయి.
ఇందులో ఏది నిజం, ఏది అబద్దం అనేది ఇంకా తేలలేదు. కాబట్టి అప్పటి వరకు సోషల్ మీడియా లో ఈ రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే పవన్ కళ్యాణ్ ఫైర్ చూస్తుంటే ఇక మీదట టాలీవుడ్ నిర్మాతలకు టికెట్ రేట్స్ ఇవ్వండం అంత సులువు కాదని అనిపిస్తుంది. భవిష్యత్తులో వాళ్ళతో చర్చలు కూడా జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇది ఆయన నుండి మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో సేఫ్టీ సరిగా ఉందా లేదా?, లైసెన్స్ లు ఉన్నాయా లేవా?, పన్నులు కడుతున్నారా లేదా విచారించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలంటూ అహఁధికారులను ఆదేశించాడు పవన్ కళ్యాణ్. సీడెడ్ ప్రాంతం లో అనేక థియేటర్స్ పన్నులు చెల్లించడం లేదని ఒక ప్రచారం ఉంది. అక్కడ కూడా తనిఖీలు నిర్వహించామని చెప్తున్నారు.