Homeక్రీడలుక్రికెట్‌RCB Vs MI Match Analysis 2026: ముంబై ఇండియన్స్ ను ఓడించిన ఆ ఇద్దరు..వారికి...

RCB Vs MI Match Analysis 2026: ముంబై ఇండియన్స్ ను ఓడించిన ఆ ఇద్దరు..వారికి MI కి ఉన్న కనెక్షన్ అలాంటిది మరి

RCB Vs MI Match Analysis 2026: ఇంటిగుట్టు లంకకు చేటు అంటారు. ఇదే థియరీ ని బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ మీద ప్రయోగించింది. చివరికి అనుకున్నది సాధించింది. ఐపీఎల్ లో అత్యంత బలమైన జట్లలో ఒకటిగా ఉన్న ముంబై ఇండియన్స్ ను ఓడించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే బౌలింగ్, బ్యాటింగ్ లో ఆ జట్టు అత్యంత బలంగా ఉంది. టీమిండియా టి20 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేయర్లలో సగం మంది ఆ జట్టులోనే ఉన్నారు. ఇండియన్ మైదానాలపై విపరీతమైన పట్టు ఉంది. అందువల్లే ముంబై ఇండియన్స్ 5 ట్రోఫీలను సాధించింది. 2013 నుంచి 2020 వరకు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ కాలంలో ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా ఐదు ట్రోఫీలను తన ఖాతాలో వేసుకుంది.

ఒకప్పటి మాదిరిగా ముంబై ఇండియన్స్ ఇప్పుడు ఆడటం లేదు.. తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం లేదు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడవ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆదివారం సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో బెంగళూరు చేతిలో ఓటమిపాలైంది… బెంగళూరు మీద సమర్థవంతమైన రికార్డు ఉన్నప్పటికీ.. ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆ మ్యాజిక్ ప్రదర్శించలేకపోయింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 240 పరుగులు చేసింది. భారీ స్కోర్ కావడంతో.. ముంబై ఇండియన్స్ కూడా ఆరంభాన్ని ఘనంగానే ప్రారంభించింది. అయితే దానిని చివరి వరకు కొనసాగించలేకపోయింది. లక్ష్యానికి 18 పరుగులు దూరంలో ఉండిపోవాల్సి వచ్చింది.

బ్యాటింగ్లో వరుస వైఫల్యాలు ఆ జట్టుకు ఓటమిని తీసుకొచ్చాయి. ముంబై ఇండియన్స్ ఓటమికి ప్రధాన కారణం ఆ జట్టు మాజీ ఆటగాళ్లే. డేవిడ్, కృనాల్ పాండ్యా ఒకప్పుడు ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. పైగా ఆ జట్టు ఆటగాళ్ల లోపాలు వారికి తెలుసు. అందువల్లే ఆ లోపాల ఆధారంగానే డేవిడ్, పాండ్యా ఆడారు. డేవిడ్ చివర్లో కీలకమైన పరుగులు చేశాడు. పాండ్యా అత్యంత పొదుపుగా బౌలింగ్ వేశాడు… అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఉంది. ముంబై ఇండియన్స్ కొన్ని మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత.. మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. గతంలో ఇదే జరిగింది.

ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు రాజస్థాన్, పంజాబ్, బెంగళూరు స్థిరమైన ప్రదర్శన చేస్తున్నాయి. ఢిల్లీ కూడా పర్వాలేదు అనే స్థాయిలో ఆడుతోంది. అయితే ముంబై ఇండియన్స్ జట్టును అంత ఈజీగా తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఆ జట్టులో భయంకరమైన ప్లేయర్లు ఉన్నారు. వారు ఏదైనా చేయగలరు. ఏ స్థాయిలోనైనా ఆట తీరు కొనసాగించగలరు. అందువల్లే ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఏ క్షణంలో అయినా విధ్వంసాన్ని కొనసాగించగలదు. అవసరమైతే ట్రోఫీని కూడా అందుకోగలదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular