Hardik Pandya : నాయకుడంటే నడిపించాలి. జట్టు భారాన్ని మోయాలి. ఆటగాళ్లను ఏకతాటిపై ఉంచాలి. క్లిష్ట సమయంలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాలి. అతడే అసలు సిసలైన సారధిగా నిలబడగలుగుతాడు, జట్టును గెలిపించగలుగుతాడు. కానీ, దురదృష్ట వశత్తూ ఆ ఆటగాడు పై లక్షణాలను క్రమంగా దూరం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఎవరు ఆటగాడు?
గత వరస సీజన్లలో ముంబై జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. దీంతో ఈసారి ముంబై జట్టు యాజమాన్యం కెప్టెన్సీ ని మార్చింది. రోహిత్ శర్మ స్థానంలో గుజరాత్ జట్టు నుంచి హార్థిక్ పాండ్యాను తీసుకుంది. వాస్తవానికి అతడి ఎంపిక పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ విమర్శలకు తగ్గట్టుగానే ముంబై జట్టు ఐపిఎల్ తొలి అర్థ సీజన్లో వరుస ఓటములు ఎదుర్కొంది. దీంతో హార్దిక్ పాండ్యా నాయకత్వంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో ముంబై జట్టు వరుస విజయాలు దక్కించుకోవడంతో కొంతలో కొంత హార్దిక్ పాండ్యాకు ఉపశమనం లభించింది. కానీ, ఈ దశలో మళ్లీ ఓటములు ముంబై జట్టును పలకరించాయి. చివరికి ఢిల్లీ లాంటి జట్టు కూడా ముంబైని ఓడించింది. ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టం చేసింది..
శనివారం జరిగిన ఈ మ్యాచ్లో ముంబై జట్టు అత్యంత దారుణమైన బౌలింగ్ ప్రదర్శన చేసింది. బుమ్రా లాంటి బౌలర్ కూడా చేతులెత్తేసాడంటే ముంబై బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టు ఆటగాళ్లపై నోరు పారేసుకున్నాడు.. కోపాన్ని అదిమి పట్టుకోలేక గట్టిగా అరిచాడు. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఫ్రేజర్ సూపర్ ఇన్నింగ్స్ వల్ల ఢిల్లీ జట్టు 257 రన్స్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టుకు ఇది హైయెస్ట్ స్కోర్. ఇన్నింగ్స్ మొదలైన నాటి నుంచి ఫ్రేజర్ ముంబై బజార్లపై ఎదురుదాడికి దిగాడు. వుడ్ బౌలింగ్ లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి 19 పరుగులు నిండుకున్నాడు. బుమ్రా కు కూడా మినహాయింపు ఇవ్వకుండా, అతడు వేసిన ఒక ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి 18 పరుగులు సాధించాడు.. నువాన్ తుశారా బౌలింగ్లో 18, హార్దిక్ పాండ్యా బౌలింగ్లో 20 పరుగులు పిండుకున్నాడు ఫ్రేజర్. అతడి బ్యాటింగ్ దాటికి ఢిల్లీ జట్టు పవర్ ప్లే లో ఏకంగా 92 పరుగులు సాధించింది. ఫ్రేజర్ వెనుతిరిగినప్పటికీ ఢిల్లీ జట్టు స్కోర్ ఆగలేదు. ముంబై బౌలర్లు పేలవంగా బౌలింగ్ చేశారు. ఫీల్డింగ్ విషయంలోనూ చురుకుగా కదల లేకపోయారు. దీంతో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా జట్టు ఆటగాళ్ల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసహనం వ్యక్తం చేసి అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ సృష్టిస్తోంది. ఈ మ్యాచ్లో రెండు ఓవర్లు వేసిన హార్థిక్ పాండ్యా.. ఏకంగా 41 రన్స్ సమర్పించుకున్నాడు.
Bro has completely lost his mind pic.twitter.com/qRCUeJVFdh
— Un-Lucky (@Luckyytweets) April 27, 2024