https://oktelugu.com/

Nose Pin : : ముక్కుకు పెట్టుకున్న పుడక ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది.. వైద్యులు ఏం చేశారంటే..

స్కానింగ్ లో ఈ విషయాలు మొత్తం గుర్తించిన వైద్యులు.. అత్యంత జాగ్రత్తగా ఆ స్క్రూ ను బయటికి తీశారు. అయితే వైద్యులు అత్యంత జాగూరుకతతో స్క్రూ బయటకి తీసిన విధానం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : April 27, 2024 / 10:39 PM IST

    Nose Pin :

    Follow us on

    Nose Pin : : కొప్పుకు పూలందం. ముక్కుకు పుడక ఆభరణం.. అంటారు పెద్దలు. అందుకే మన దేశంలో చాలామంది మహిళలు ముక్కుకు పుడకను ధరించుకుంటారు. వారి ఆర్థిక స్తోమత ఆధారంగా పుడకను ధరిస్తారు. ఈ పుడకను ధరించడంలోనూ రకరకాల సంప్రదాయాలు ఉంటాయి. ఆదివాసి మహిళలు ఒక విధంగా.. ఈశాన్య రాష్ట్రాల మహిళలు మరొక విధంగా.. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మహిళలు ఇంకొక విధంగా ముక్కుపుడకలు ధరిస్తుంటారు. అయితే వీటిల్లో వారి సంప్రదాయం ప్రతిబింబించే విధంగా డిజైన్లు రూపొందించుకుంటారు. అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ 35 ఏళ్ల మహిళ ధరించిన ముక్కుపుడక పెద్ద చర్చకు దారి తీసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

    పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వర్ష అనే మహిళకు 35 సంవత్సరాలు ఉంటాయి. పెళ్లయింది, పిల్లలు కూడా ఉన్నారు. వారి సంప్రదాయం ప్రకారం ఆమెకు ఐదేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులు ముక్కు పుడక కుట్టించారు. తన యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఆమె తన ముక్కు పుడకను మరింత పెద్దగా చేసుకుంది.. దానికి రకరకాల డిజైన్లు జత చేసింది. అయితే ఈ క్రమంలో ఆ ముక్కు పుడక సంబంధించిన స్క్రూ ఊడిపోయింది. అది చిన్నగా ఉండడంతో ముక్కు ద్వారా ఆమె శ్వాస తీసుకునే సమయంలో అది నేరుగా ఊపిరి తిత్తులలోకి వెళ్లిపోయింది. స్క్రూ అలా వెళ్ళిపోయినట్టు వర్ష గుర్తించలేదు. పైగా ఆమెకు శ్వాసలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడలేదు.

    కొద్దిరోజులు గడిచిన తర్వాత శ్వాస తీసుకోవడంలో వర్ష ఇబ్బంది పడింది. ఈ విషయాన్ని తన భర్తకు చెబితే అతడు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆమెకు నాన్ ఇన్వాసివ్ శస్త్ర చికిత్స చేయాలని భర్తకు చెప్పారు. దీంతో మొదట్లో వారు భయపడ్డారు. చివరికి సర్జరీకి ఒప్పుకున్నారు. సర్జరీలో భాగంగా ఆమె శ్వాస నాళాలలోకి మధ్యలో బ్రాంకోస్కోప్ పంపించారు. ఆ తర్వాత ఆ స్క్రూ వల్ల వర్ష ఊపిరి తిత్తుల్లో కొంత భాగం దెబ్బతిన్నది. దీంతో ఇన్వాసివ్ సర్జరీ ద్వారా వైద్యులు ఆ భాగాన్ని తొలగించాలని భావించారు. అయితే ఆమెకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావద్దనే ఉద్దేశంతో ఆ సర్జరీని మానుకున్నారు. ఇక వేరే మార్గం లేక బ్రాంకోస్కోప్ తోనే పలుమార్లు ప్రయత్నాలు చేసి ముక్కుపుడకకు సంబంధించిన స్క్రూ బయటకి తీశారు.

    ఇలాంటి విధానంలో ఊపిరితిత్తుల వంటి సున్నిత అవయవాల నుంచి స్క్రూ లాంటి ఇనుప వస్తువును బయటికి తీయడం అత్యంత సులభం కాదు. దాదాపు 15 రోజులపాటు వర్ష ఊపిరితిత్తుల్లో ఆ స్క్రు ఉండిపోయింది. పైగా ఆ స్క్రూ చుట్టూ కణజాలం పెరుగుతోంది. స్కానింగ్ లో ఈ విషయాలు మొత్తం గుర్తించిన వైద్యులు.. అత్యంత జాగ్రత్తగా ఆ స్క్రూ ను బయటికి తీశారు. అయితే వైద్యులు అత్యంత జాగూరుకతతో స్క్రూ బయటకి తీసిన విధానం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.